IPL 2016, RCB vs KKR: Quiet Knight Yusuf Pathan rises in Bangalore

Yusuf russell power knight riders to scorching win

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Kolkata Knight Riders, yousuf pathan, Royal Challengers Bangalore, Kohli, Uthappa IPL, cricket, IPL 9, Cricket latest IPL 9 news

Yusuf Pathan comes to party with whirlwind match-winning 60*, but not before KKR survive Chahal’s fiery spell.

కోల్‌కతాను గెటిపించిన యూసుప్ పఠాన్

Posted: 05/03/2016 04:02 PM IST
Yusuf russell power knight riders to scorching win

యూసుఫ్ పఠాన్ అంటే విధ్వంసానికి పక్కా చిరునామా. చెలరేగి అడితే విండీస్ గేల్ గుర్తుకు రావడం కామన్. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన పఠాన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మండుతున్న అగ్ని కణికలా మారి.. విజయానికి అవకాశం లేని చోట అద్భుత ప్రదర్శనతో కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. ఆండ్రీ రసెల్ సహకారం అతని పనిని సులువు చేసింది. ఇక కోల్ కత్తా జట్టుకు మరో ధీటైన బ్యాట్స్ మెన్ ఫామ్ లోకి రావడం కలిసోచ్చే అంశంగా పరిగణిస్తున్నారు అభిమానులు

కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయిన సమయంలో విజయ లక్ష్యం 59 బంతుల్లో 117 పరుగులు... సొంతగడ్డపై బెంగళూరు బౌలర్ల క్రమశిక్షణతో ఇది అసాధ్యంగా కనిపించింది. కానీ పఠాన్, రసెల్ దీనిని సుసాధ్యం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 44 బంతుల్లోనే 96 పరుగుల జోడించి రాయల్ చాలెంజర్స్‌ను కుమ్మేశారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నైట్‌రైడర్స్‌కు విజయం దక్కింది. ఫలితంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ లక్ష్య ఛేదనలో మరోసారి సత్తా చాటింది. రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది.

బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో క్రితం రోజు జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 52; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో వాట్సన్ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు.

అనంతరం అదిలోనే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాలలో పడిన కోల్ కతాను యూసుప్ ఫఠాన్; అండడ్రీ రాసెల్ లు అదుకుని విజయతీరాలకు చేర్చారు. యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (24 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్సర్లు) భారీ భాగస్వామ్యం సహాయంతో కోల్‌కతా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రసెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Kolkata Knight Riders  yousuf pathan  Royal Challengers Bangalore  Kohli  Uthappa  

Other Articles