ravindra jadeja reprimanded for showing dissent at umpires decision

Ravindra jadeja joins reprimand list

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Ravindra Jadeja, reprimand, Gujarat Lions, Kings XI punjab, IPL, cricket, IPL 9, Cricket latest IPL 9 news

Gujarat Lions all-rounder Ravindra Jadeja has been reprimanded by the match referee for showing dissent at the umpire's decision during his side

ఆ జాబితాలో చేరిన రవింద్ర జడేజా

Posted: 05/02/2016 06:16 PM IST
Ravindra jadeja joins reprimand list

ఐపీఎల్ లో గెలుపుకోసం వీరోచిత పోరాటం చేస్తున్న ఆటగాళ్లకు అదే స్థాయిలో మందలింపుల పర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా మ్యాచ్ రిఫరీల చేతిలో చీవాట్లు తిన్న వారి జాబితాలో కొత్త పెళ్లికొడుకు రవీంద్ర జడేజా కూడా చేరాడు. పంబాబ్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇప్పటికే మందలింపులు ఎదుర్కొన్నారు. తాజాగా గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ జడేజా ఈ లిస్టులో చేరాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని మందలించారు. ఐపీఎల్ సీజన్ 9లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ తరుపున అడుతున్న జడేజా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన ఓవర్లో విసిరిన బంతికి అప్పీల్ చేశాడు. అయితే జడేజా అప్పీల్ ను అంపైర్ తోసిపుచ్చాడు. దీంతో అంఫైర్ నిర్ణయంపై జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడు మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో జడేజాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడించింది. కాగా, రవీంద్ర జడేజా ఏప్రిల్ 17న రాజ్ కోట్ లో పెళ్లిచేసుకున్నాడు. వివిధ కారణాలతో డు ప్లెసిస్, కోహ్లి, శరణ్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Ravindra Jadeja  reprimand  Gujarat Lions  cricket  Kings eleven punjab  

Other Articles