Rohit is one of the top T20 batsmen after Kohli: Robin Singh

Robin singh praises rohit s match winning knock against kkr

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Rohit sharma, Kieron Pollard, Robin Singh, Mumbai Indians, cricket, IPL 9, Cricket latest IPL 9 news

Mumbai Indians deputy coach Robin Singh heaped praise on his team's skipper Rohit Sharma after his match-winning knock against Kolkata Knight Riders at the Wankhede

కోహ్లీ తరువాత అతనే టీ20 స్పెషలిస్ట్..

Posted: 04/30/2016 04:10 PM IST
Robin singh praises rohit s match winning knock against kkr

ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. టీ 20 ఫార్మాట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న రోహిత్.. ఈ ఫార్మాట్ కు అతికినట్లు సరిపోయే ఆటగాడని కొనియాడాడు. ఈ ఫార్మాట్ లో టాప్ ఆటగాళ్లలో రోహిత్ కూడా ఒకడన్నాడు. టీ 20ల్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తరువాత స్థానం రోహిత్ శర్మదేనని రాబిన్ తెలిపాడు.

'అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి సక్సెస్ సాధించలేకపోవచ్చు. ప్రత్యేకంగా టెస్టు క్రికెట్ కు, పొట్టి ఫార్మాట్ కు చాలా వ్యత్యాసం ఉంటుఉంది. టీ 20 ఫార్మాట్ టాప్ ఆటగాళ్ల జాబితాలో స్టార్ ఆటగాడు విరాట్ తరువాత స్థానం కచ్చితంగా రోహిత్ శర్మదే'అని రాబిన్ పొగడ్తల్లో ముంచెత్తాడు.ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితం మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడని, అతడు గాడిలో పడడం తమ టీమ్‌కు అనుకూలించే అంశమని చెప్పాడు. తనదైన రోజున అతడిని ఆపడం ప్రత్యర్థుల తరం కాదని వ్యాఖ్యానించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Rohit sharma  Kieron Pollard  Robin Singh  Mumbai Indians  cricket  

Other Articles