English team bowled out for zero

English team bowled out for zero

cricket, England, English Team at Zero score, ECB

A cricket team were bowled out for nought in just 20 balls to lose a game by 120 runs, the England and Wales Cricket Board (ECB) reported Thursday. The rare result came during the Kent regional finals of the ECB's national six-a-side championship when the Bapchild team failed to trouble the scorers in an indoor game against Christ Church University in Canterbury.

ఇదో రికార్డ్: జీరో రన్స్... 20 బాల్స్.. ఆలౌట్

Posted: 02/12/2016 04:07 PM IST
English team bowled out for zero

క్రికెట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అతి చెత్త కే చెత్త రికార్డును పరిచయం చేసింది ఇంగ్లీష్ టీం. క్రికెట్ చరిత్రలో కనీసం ఎన్నడూ వినని, ఊహించని రికార్డ్ నమోదైంది. క్రికెట్ కు ప్రాణంపోసిన ఇంగ్లీష్ గడ్డ మీదనే ఈ రికార్డ్ క్రియేట్ కావడం విశేషం. ప్రత్యర్థి జట్టు 120 పరుగులు చేస్తే.. బరిలోకి దిగి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చెయ్యకుండా ఆలౌట్ అయి చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.? లండన్ క్రికెట్ బోర్డును కూడా ఆశ్చర్యపరిచిన ఈ మ్యాచ్ విశేషాలు వింటే మీరు కూడా షాక్ అవుతారు.

కంటెర్‌బరీ క్రికెట్ మైదానంలో బాప్‌చైల్డ్‌ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచులో ఈ వింత చోటుచేసుకుంది. ఇండోర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో బాప్‌చైల్డ్ జట్టు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా ఆలౌటైంది. అయితే ఆ జట్టును ఒక్క పరుగు చేయకుండా ఆలౌట్ చేసిన ప్రత్యర్థి జట్టుఆటగాళ్లే ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు.  కెంట్ ప్రాంతీయ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌లో ఈ వింత చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలియడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బిత్తరపోయింది. దీని మీద ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసింది. అయితే దీని మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు ఇది సాధ్యమా అన్నదే అసలు ప్రశ్న. కానీ మొత్తానికి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ చేసిన ట్వీట్ మాత్రం క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివిని ఎరుగనిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  England  English Team at Zero score  ECB  

Other Articles