New Zealand | won | Kiwis win | Brendon McCullum | Sports

New zealand won by 55 runs

New Zealand won by 55 runs, Brendon McCullum send off party, Brendon McCullum bye bye, New Zealand won 3rd ondi, New Zealand won, New Zealand won stills, New Zealand won match

New Zealand won by 55 runs: Kiwis win match by 55 runs and series 2-1 to secure Chappell-Hadlee Trophy.

విక్టరీతో మెకల్లమ్ కు ఘన వీడ్కోలు

Posted: 02/08/2016 04:11 PM IST
New zealand won by 55 runs

న్యూజిలాండ్ క్రికెట్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ కు ఆ జట్టు ఘనమైన వీడ్కోలును అందించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సీరిస్ ను న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. మొదట బ్యాంటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మెకల్లమ్ (47; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగగా... గఫ్టిల్ (59;61 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సర్లు) రాణించాడు. ఆ తరువాత ఎలియట్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు న్యూజిలాండ్ ను గౌరవప్రదమైన స్కోర్ ను వుంచగలిగింది.

అనంతరం లక్ష్య చేధనలో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 191 పరుగులకే ఓటమి పాలయ్యింది. ఉస్మాన్ ఖాజా(41), జార్జ్ బెయిలీ(33), మిచెల్ మార్ష్(41) మినహా ఎవరూ సరైన విధంగా ఆడకపోవడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. దీంతో న్యూజిలాండ్ గెలిచి మెకల్లమ్ కు గ్రాండ్ గా వీడ్కోలును ఇచ్చినట్లయ్యింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand won  Kiwis win  Brendon McCullum  Sports  

Other Articles