Shane Watson remains costliest

Shane watson remains costliest

Shane Watson , Yuva Raj SIngh, IPL, IPL-9, Dale Steyn

The IPL auction for the 2016 season of the T20 League in Bangalore on Saturday. While the likes of Yuvraj Singh, Kevin Pietersen, Shane Watson and Dale Steyn generate top interest, the youngsters of India and some England players are also popular. The eight franchises would like to pick the best combination. Catch the IPL Auction 2016 Live here

IPL-9 లోవాట్సన్ 9 కోట్ల 30 లక్షలు.. యువరాజ్ సింగ్ 7 కోట్లు

Posted: 02/06/2016 03:13 PM IST
Shane watson remains costliest

అందరూ అనుకున్నట్లే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు ఐపీఎల్-9 సీజన్ వేలంలో కాసుల పంట పండింది. భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ఊహించని విధంగా డిమాండ్ తగ్గగా, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు కాసుల పంట పండింది. శనివారం జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యువీని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో రూ. 16 కోట్ల ధర పలికిన యువరాజ్ సింగ్ ఈసారి దాదాపు సగానికి సగం తక్కువ ధర పలికాడు. కాగా వాట్సన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలకు వాట్సన్ ను దక్కించుకుంది. కెవిన్ పీటర్సన్ ను రూ. 3.5 కోట్లతో పుణె సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. బౌలర్ ఇషాంత్ శర్మను రూ. 3.8 కోట్లతో పుణె సూపర్ జెయింట్స్ దక్కించుకొగా, ఆశీష్ నెహ్రాను రూ. 5.5 కోట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. డేల్ స్టెయిన్ ను రూ. 2.3 కోట్లతో గుజరాత్ లయన్స్ , జోస్ బట్లర్ ను రూ. 3.8 కోట్లకు ముంబై ఇండియన్స్ , సంజూ శామ్సన్ రూ. 4.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకున్నాయి.

ఎవరికి ఎంత ?
డేల్ స్టెయిన్ – 2 కోట్ల 30 లక్షలు – గుజరాత్ లయన్స్
యువరాజ్ సింగ్ – 7 కోట్లు – హైదరాద్ సన్ రైజర్
ఆశిష్ నెహ్రా – 5కోట్ల 50 లక్షలు – హైదరాబాద్ సన్ రైజర్స్
షేన్ వాట్సన్ – 9కోట్ల 50 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఇషాంత్ శర్మ – 3కోట్ల 80 లక్షలు – పూణె సూపర్ గెయింట్స్
డెయిన్ స్మిత్ – 2 కోట్ల 30 లక్షలు – గుజరాత్ లయన్స్
కెవిన్ పీటర్సన్ – 3 కోట్ల 50 లక్షలు – పూణె సూపర్ గెయింట్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Watson  Yuva Raj SIngh  IPL  IPL-9  Dale Steyn  

Other Articles