bangladesh odi skipper mashrafe hospitalised with dengue

Bangladesh odi skipper mortaza hospitalised with dengue

Bangladesh, Mashrafe Bin Mortaza, Apollo Hospital, Bangladesh Cricket Board, BCB, Bangladesh ODI skipper, dengue fever, cricket news

Bangladesh One-Day International (ODI) skipper Mashrafe bin Mortaza was on Friday hospitalised after being diagnosed with dengue fever.

ఆసుపత్రిలో చేరిన బంగ్లా వన్డే కెప్టెన్ మోర్తజా

Posted: 10/09/2015 07:13 PM IST
Bangladesh odi skipper mortaza hospitalised with dengue

బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రాఫె బిన్ మోర్తజా ఆస్పత్రిలో చేరాడు. ఢాకాలోని అపోలో ఆస్పత్రిలో మోర్తజాకు చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న అతనికి టెంపరేచర్ అధికంగా వుందని, దాంలో అతడ్ని అస్పత్రిలో చేర్చామని అతడి స్నేహితుడు చెప్పాడు. దీంతో ఆయన బంగ్లా నేషనల్ లీగ్కు దూరమయ్యాడు. కాగా అతను త్వరలోనే కోలుకుని.. ఫిట్ నెస్ సాధించి త్వరగానే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో చేరుతాడని స్నేహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మోర్తజా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డు ఫిజీషియన్ డేబాషిస్ చౌదరి వివరించారు. 'మోర్తజాకు చికిత్స చేస్తున్న డాక్టర్తో మాట్లాడాను. అతనికి డెంగ్యూ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కొద్ది రోజులుగా మోర్తజా కొడుకు (ఏడాది వయసు) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం మోర్తజాకు కూడా తీవ్ర జ్వరం వచ్చింది. ఇప్పటికీ జ్వరం ఎక్కువగా ఉంది' అని చౌదరి చెప్పారు. అయితే వైద్యులు అన్ని జాగ్రత్తలు మధ్య ముర్తుజా కు చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh ODI skipper  Mashrafe bin Mortaza  dengue  

Other Articles