Sachin Tendulkar Says Son Arjun is Interested in Joining Indian Air Force

Proud sachin tendulkar attends air force day celebrations

sachin air force, sachin tendulkar indian air force, sachin tendulkar iaf, sachin in air india force, sachin in air force uniform, sachin tendulkar honoured indian air force, sachin rank in indian air force, sachin rank in iaf, sachin tendulkar air force

Sachin Tendulkar who was made an Honourary Group Captain in the Indian Air Force in 2010, however, stressed that Arjun is too young to give it a serious thought.

వైమానిక దళంలో చేరేందుకు అర్జున్ అసక్తి..

Posted: 10/08/2015 08:57 PM IST
Proud sachin tendulkar attends air force day celebrations

తన కొడుకు అర్జున్ టెండూల్కర్ వైమానిక దళంలో చేరేందుకు అధిక ఉత్సాహం కనబరుస్తున్నాడని మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే, అతడు చేరతాడా లేదా అనే విషయం అప్పుడే మాత్రం చెప్పలేమన్నాడు. వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్గా ఉన్న సచిన్.. హిండన్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ డే పెరేడ్ లో పాల్గోన్నారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. అయితే యిర్ ఫోర్స్ డే పెరేడ్ అతడ్ని కూడా వెంటబెట్టుకుని హిండస్ బేస్ క్యాంప్ వద్దకు తీసుకువద్దామనుకున్నానని తెలిపాడు.

తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ వయస్సు ఇప్పుడు 16 ఏళ్లని.. మరింత సమయం తరువాత ఆయన ఏం చేయాలన్నది తానే నిర్ణయించుకుంటాడని చెప్పారు. కాగా, ఎయిర్ ఫోర్స్ అంటే మాత్రం చాలా ఇష్టాన్ని కనబరుస్తున్నాడని చెప్పాడు. మరో రెండేళ్ల తరువాత అర్జున్ తానేమి కావాలనుకుంటున్న దానిపై స్పష్టం వస్తుందని చెప్పాడు. సుఖోయ్ యుద్ధ విమానంలో వెళ్లాలన్న తన కోరిక తీరిందా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నపై స్పందించిన సచిన్.. ఔనౌను.. తాను గతంలో ఈ  విషయాన్ని చెప్పానని, కాగా అది ఇంతవరకు కుదరలేదని మాస్టర్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Arjun Tendulkar  Indian Air Force  Air Force Day celebrations  

Other Articles