India vs South Africa: Teaser trailer of pace, spin face-off

India vs south africa 2015 the way forward

"india vs south africa, ind vs sa, ind sa, india south africa, south africa in india, india vs sa, sa vs india, india south africa series, south africa tour of india 2015, kolkata, eden gardens, r ashwin, ashwin india, cricket news, cricket

South Africa, in the first T20I matches, have struggled against R Ashwin while India have found going tough against visitors seamers.

ఈడెన్ లోనైనా ఓటములను వీడుతారా..? అభిమానుల్లో ఉత్కంఠ

Posted: 10/07/2015 06:58 PM IST
India vs south africa 2015 the way forward

భారత దేశ పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికన్లకు టీ-20 సిరీస్ ను చేజార్చుకున్న అధిత్య జట్టు.. సిరీస్ ను క్లీస్ స్వీప్ గా అందిస్తుందా..? లేక ఈడెన్ గార్డెన్స్ వేధికగా జరిగే చివరి టీ-20లో విజయాన్ని నమోదు చేసుకుంటుందా..? అన్న ఉత్కంఠ టీమిండియా అభిమానుల్లో రేకెత్తుతోంది. వార్మ్ అప్ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూసిన ధక్షిణాఫ్రికా జట్టు.. ధోణి సేనపై గత రెండు టీ-20లలోనూ విరుచుకుపడి విజయాన్ని అందుకుంది. అందేకాకుండా టీ-20 సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.

దీంతో చివరి మ్యాచ్ లోనూ విజయం సాధించి.. సిరీస్ ను క్వీన్ స్వీప్ గా ముగించాలని సఫారీలు భావిస్తూ.. ఆ మేరకు వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నారు. అయితే అదే సమయంలో టీమిండియా కూడా చివరి టీ-20లోనైనా తమ సత్తా చాటుకుని.. విజయాన్ని అందుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. అయితే టీ-20 మ్యాచ్ లలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పేసర్లు బాగా రాణిస్తున్నారు. స్పినర్లు తమ ఉనికి చాటుకోవడానికి యత్నిస్తున్నా.. మ్యాచ్ ఆద్యంతం పేసర్లే తమ హావాను కోనసాగిస్తున్నారు.

విజయం కోసం వేచిచూస్తూ.. శ్రమించినా ఫలితం లేకుండా పోతున్న ధోని సేనకు ఇదే కొంత అవరోధంగా కూడా కనిపిస్తుంది. సఫారీల జట్టులోని పేసర్లు షాన్ పోలాక్, అలాన్ డోనాల్డ్, ఎన్టినీ, డేల్ స్టీన్, మార్నీ మార్కెల్ లాంటి పేసర్లు గేమ్ చేంజర్లుగా కీర్తి గడించారు. ఇక అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రస్తుత పేసర్లు కూడా అద్భుతంగా రాణించడంతో వారిని ఎదుర్కోవడంతో భారత బ్యాట్స్ మెన్లు కోంత ఇబ్బందులు పడుతున్నారు. భారత్ లోనే అత్యంత పెద్దది, విశాలమైన స్టేడియం ఈడెన్ గార్డెన్స్ లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చేడాలంటే మరికోన్ని గంటలు వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  team india  south africa  south africa tour of india 2015  kolkata  eden gardens  

Other Articles