Sachin Tendulkar To Play Cricket Again For The US Cricket Tour To Promote Gentlemen Game In America | Sachin History

Sachin tendulkar to play cricket again for the us cricket tour

Sachin Tendulkar, Sachin Tendulkar news, Sachin Tendulkar us tour, Sachin Tendulkar gentlemen game, Sachin Tendulkar updates, Sachin Tendulkar shane warne, us cricket tour, us cricket game, us cricket tour news, shane warne news, indian cricket team

Sachin Tendulkar To Play Cricket Again For The US Cricket Tour : Sachin Tendulkar To Play Cricket Again For The US Cricket Tour To Promote Gentlemen Game In America Along With Shane Warne And Other 25 Famous Players.

అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి క్రీజులోకొస్తున్న సచిన్..

Posted: 10/06/2015 06:12 PM IST
Sachin tendulkar to play cricket again for the us cricket tour

అవును.. 2011 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇన్నాళ్లూ పక్కన పెట్టేసిన తన బ్యాటుకు మరోసారి పని చెప్పబోతున్నాడు.. మైదానంలో దిగి తన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనున్నాడు.. ప్రత్యర్థి ఆటగాళ్లను ముచ్చెమటలు పట్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే.. ఈసారి ఆయన క్రీజులోకి అడుగుపెడుతోంది ఇండియా క్రికెట్ జట్టు కోసం కాదులెండి.. అమెరికాలో ‘జెంటిల్మన్ గేమ్’ను ప్రాచుర్యం చేయడం కోసమట!

‘జెంటిల్మన్ గేమ్’గా ప్రసిద్ధిగాంచిన క్రికెట్ అంటే నిన్నటిదాకా ప్రపంచంలోని చాలా దేశాలకు అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే కాలం మారుతోంది. ఇతర దేశాలు కూడా క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. త్వరలో ఆ దేశం కూడా క్రికెట్ ఆడే దేశాల చెంత చేరనుంది. ఇందుకోసం ఆ దేశం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే.. క్రికెట్ పై ఆ దేశ పౌరులకు ఆసక్తి, అవగాహన అంతగా లేదు కాబట్టి.. ముందుగా ఆ పనిచేసేందుకు అమెరికా నడుం బిగించింది. ఈ నేపథ్యంలనే తమ దేశంలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు అమెరికా భారీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో న్యూయార్క్, లాస్ ఏంజెలిస్, హోస్టన్ లలోని బేస్ బాల్ స్టేడియంలు క్రికెట్ మైదానాలుగా మారనున్నాయి.

ఇక ఇప్పటికే క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాలుగా ఖ్యాతిగాంచిన 25 మంది ఈ స్టేడియంలలో క్రికెట్ ఆడనున్నారు. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ మ్యాచ్ ల్లో సచిన్ తో పాటు షేన్ వార్న్, వసీం అక్రం, మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, బ్రియన్ లారా, జాకస్ కలిస్ తదితర 25 మంది దిగ్గజాలు పాల్గొంటారట. వచ్చే నెల 7న న్యూయార్క్ లో, 11న హోస్టన్ లో, 14న లాస్ ఏంజెలిస్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇలా ఈ విధంగా సచిన్ మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  US gentlemen Cricket Tour  Shane Warne  

Other Articles