Mahendra Singh Dhoni Says Fans Fans Throw Bottles On Ground Only For Fun | India Africa T20 Match | Fans Throw Bottles Orissa Ground

Mahendra singh dhoni comments cricket fans throw bottles on ground during india africa t20 match

mahendra singh dhoni news, ms dhoni news, ms dhoni controversies, fans throw bottles on ground, india south africa t20 match, sunil gavaskar news, ms dhoni latest press meet, ms dhoni makes controversy statements, ms dhoni speaks about bottles incident

Mahendra Singh Dhoni Comments Cricket Fans Throw Bottles On Ground During India Africa T20 Match : Mahendra Singh Dhoni Says Fans Fans Throw Bottles On Ground Only For Fun | India Africa T20 Match. But Gavaskar Said To Cancel The Matches On That Ground For 2 Years.

బాటిళ్ల రగడపై ఫ్యాన్స్ ని వెనకేసుకొచ్చిన ధోనీ

Posted: 10/06/2015 05:40 PM IST
Mahendra singh dhoni comments cricket fans throw bottles on ground during india africa t20 match

భారత్, దక్షిణాఫ్రికా రెండో టి-20 మ్యాచ్ సందర్భంగా కటక్ స్టేడియంలో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి పెద్ద రభస సృష్టించిన విషయం తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్ విఫలమైనందుకు ఆగ్రహించిన ప్రేక్షకులు.. ఆ విధంగా బాటిళ్లు మైదానంలో విసిరి తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ వ్యవహారంపై మీడియా, క్రీడా రంగాలు తప్పుపట్టాయి. క్రికెట్ అభిమానులు మైదానంలో సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. కానీ.. టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ మాత్రం ఆ సంఘటనను తేలిగ్గా తీసుకోవడమే కాకుండా దానికి పాల్పడిన అభిమానుల్ని వెనకేసుకొచ్చాడు.

కటక్లో ప్రేక్షకుల తీరు వల్ల ఆటగాళ్ల భద్రతకు హానీ కలగలేదని, ఈ సంఘటనను సీరియస్గా తీసుకోరాదని అన్నాడు. సరదా కోసమే ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరారంటూ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. గతంలో వైజాగ్లో ఓ మ్యాచ్ను అలవోకగా గెలిచినప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాగే బాటిళ్లు విసిరారని ధోనీ చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశారని, ఇలాంటి ఘటనలను సీరియస్ గా పరిగణించరాదని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడంతో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి అంతరాయం కలిగించారు. పైగా.. మూడు టి-20 మ్యాచుల సిరీస్ కు వారికి కైవసం అవుతోందన్న ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు తమ కోపాన్ని బాటిళ్లు విసిరి ప్రదర్శించారు. ఏదేమైనా.. ఈ వ్యవహారంపై ధోనీ తెలిపిన అభిప్రాయాన్ని చాలామంది తప్పుపట్టిన కొందరు మాత్రం కూల్ గా ఆలోచించి సమాధానమిచ్చాడని పేర్కొంటున్నారు.

కానీ.. మరోవైపు ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధం విధించాలని గవాస్కర్ సూచించాడు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని అన్నాడు. కటక్కు మరో రెండేళ్ల అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించకపోవడంతో పాటు ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు ఆపేయాలని గవాస్కర్ సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  cricket fans throw bottles ground  sunil gavaskar  

Other Articles