monkeygate controversy could have been solved by me and ricky ponting says anil kumble

Ponting and i could have solved monkeygate kumble

india cricket team, india cricket, cricket india, sachin tendulkar, tendulkar, anil kumble, kumble, india vs australia, australia vs india, australia cricket team, india vs south africa, ind vs sa, cricket news, cricket

On the issue of different captains for different formats, Anil Kumble said he does not see it as an issue.

మంకీగేట్ ను మేమిద్దరమే పరిష్కరించాం..

Posted: 10/04/2015 08:55 PM IST
Ponting and i could have solved monkeygate kumble

గత ఏడు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ల మధ్య చోటు చేసుకున్న 'మంకీగేట్' వివాదాన్ని అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ తో కలిసి  తాను సద్దుమణిగేటట్లు చేశానని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపాడు.  తామిద్దరం కలిసి కూర్చోని ఆ వివాదాన్ని పెద్దది కాకుండా రాజీ చేశామన్నాడు. 2008 ఆసీస్ పర్యటనలో భాగంగా రెండో టెస్టులో సైమండ్స్-హర్భజన్ ల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
 
దీనిపై తాజాగా కుంబ్లే మాట్లాడుతూ.. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ , వీరేంద్రసెహ్వాగ్ లు హర్భజన్ కు అండగా నిలిచారన్నాడు. క్రికెట్ జట్టు కెప్టెన్లకు పరిణితితో కూడిన దూకుడు మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా కుంబ్లే తెలిపాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా జరిగే ఘటనలపై కెప్టెన్ ఆచితూచి వ్యవహరించాలన్నాడు. ప్రస్తుతం టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారని, అది ఏమీ పెద్దగా కష్టసాధ్యమైన అంశమైతే కాదని కుంబ్లే తెలిపాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  team india  symonds  harbajan  monkeygate  

Other Articles