some umpiring decisions changed the game says ms dhoni

Ms dhoni feels umpiring decisions led to india s loss in 1st t20 against south africa

IND vs SA,India vs South Africa,India vs South Africa 1st T20,India vs South Africa 2015,MS Dhoni, Mahendra singh Dhoni, south africa t-20, umpiring faults, dumini

India captain MS Dhoni said he believed some umpiring decision which did not go in favour of his side changed the game as South Africa beat the host by seven wickets in the first T20

స్వదేశంలోనూ అదే రాగాన్ని అలపిస్తున్న టీమిండియా

Posted: 10/03/2015 04:20 PM IST
Ms dhoni feels umpiring decisions led to india s loss in 1st t20 against south africa

ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఉంది టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహారం. విదేశాల్లోనే కాదు స్వదేశంలో మ్యాచ్ లు ఓడిన ప్రతీసారి.. మా ఓటమి కారణం అదేనంటూ ఆయన కొత్త రాగాన్ని ఎత్తుకుంటున్నారు. విదేశాలలో ఆడేటప్పుడు అంపైర్ల తప్పుల వల్లే ఓడిపోయామని చెప్పేన భారత క్రికెటర్లు.. సొంత దేశంలో కూడా అదే పల్లవి అందుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన టి-20 మ్యాచ్లో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ నెపాన్ని అంపైర్ల మీదకు నెట్టేశాడు.  

దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డుమినీ చేసిన 68 పరుగులే ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పిన ధోని.. ఆయన క్రీజ్ లో నిల్చున్నంత సేపటిలో రెండు సార్లు ఎల్బీడబ్యూ చేసినట్లు అప్పీలు చేశామని గుర్తుచేశారు. అయితే రెండుసార్లు భారత బౌలర్లు డుమినీని ఎల్బీడబ్ల్యు చేసినట్లు అప్పీలు చేసినా, అంపైర్లు మాత్రం వాళ్లతో ఏకీభవించలేదు. ఆ రెండు సార్లూ అతడు అవుటయినట్లే ఉందని, ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల మ్యాచ్ మొత్తం మారిపోతుందని ధోనీ వ్యాఖ్యానించాడు. డుమినీ ముందే అవుటైతే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. చేతిలో మంచి స్కోరు ఉన్నా కూడా.. మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అంతగా విజయం సాధించలేక పోయారని నర్మగర్భవ్యాఖ్యలు చెశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra singh Dhoni  south africa t-20  umpiring faults  dumini  

Other Articles