marvan atapattu resigns as sri-lanka coach after test series loss to india

Sri lanka coach head atapattu resigns after back to back series loss

sri lanka cricket, cricket sri lanka, india vs sri lanka, sri lanka vs india, marvan atapattu, atapattu, sri lanka coach, sri lanka cricket coach, marvan atapattu sri lanka, sri lanka marvan atapattu, india tour of sri lanka 2015, colombo, cricket news, cricket

Former Sri Lankan captain Marvan Atapattu who was appointed head coach in October 2014 resigned after Sri Lanka lost back-to-back Test series against Pakistan and India.

వరుస సిరీస్ ఓటములతో శ్రీలంక ప్రధాన కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా..!

Posted: 09/04/2015 07:00 PM IST
Sri lanka coach head atapattu resigns after back to back series loss

స్వదేశంలో జరిగిన రెండు వరుస సిరిస్ ఓటములు శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌తో పాటుగా అంతకు ముందు పాకిస్థాన్ తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల ఓటములను తాను నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మర్వన్ ఆటపట్టు రాజీనామా చేశాడు. గత మూడు నెలల్లో శ్రీలంక వరుసగా పాకిస్థాన్, భారత్ చేతిలో టెస్టు సిరిస్‌ను ఓటమి పాలైవ్వడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆటపట్టు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1 తేడాతో భారత్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస సిరిస్ ఓటములకు బాధ్యత వహిస్తూ కోచ్ మర్వన్ ఆటపట్టు రాజీనామా చేశాడు.

ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్‌ తాత్కాలిక అధ్యక్షుడు సిదాత్‌ వెట్టిముని తెలిపాడు. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్‌ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న చండికా హతురసింఘేను కొత్త కోచ్‌గా నియమించాలనే ఆలోచనలో శ్రీలంక బోర్డు ఉంది. కోచ్ చండికా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ క్వార్టర్స్‌కు వెళ్లడమే కాకుండా పాకిస్ధాన్, భారత్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరిస్‌లలో చక్కగా రాణించింది. శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ గా  గత ఏడాది అక్టోబర్ లో ఆటపట్టు బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఏడాది కూడా తిరగకముందే.. ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకు ముందు శ్రీలంక జట్టుకు 2011 నుంచి బ్యాటింగ్ కోచ్ గా, ఫీల్డింగ్ కోచ్ గా ఆటపట్టు సేవలందించారు. శ్రీలంక మాజీ కెప్టెన్ గా సేవలందించిన ఆటపట్టు..లంక తరఫున 90 టెస్టులు, 268 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5502, వన్డేల్లో 8529 పరుగులు సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marvan atapattu  cricket  sri lanka  india tour of sri lanka 2015  colombo  

Other Articles