BCCI members do not want N Srinivasan to attend working committee meeting

Will n srinivasan attend working committee meeting

india vs sri lanka, india tour of sri lanka, cricket, cricket, bcci, bcci working committee, bcci working committee meeting, n srinivasan, srilanka, india tour of sri lanka 2015, india sri lanka, ind vs sl, kl rahul, rahul, virat kohli, kohli, India, Srilanka, India vs srilanka, cricket news

BCCI members do not want N Srinivasan to attend working committee meeting - Srinivasan will attend the meeting as the representative of the Tamil Nadu cricket association.

బిసిసిఐ సమావేశానికి శ్రీనివాసన్ హజరవుతారా..?

Posted: 08/27/2015 03:50 PM IST
Will n srinivasan attend working committee meeting

భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎన్ శ్రీనివాసన్ హాజరవుతారా..? అన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం కొల్ కత్తా నగరంలో జరగనున్న సమావేశానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఆయన ఈ సమావేశానికి హాజరవుతారని కొందరు వాదిస్తున్న క్రమంలో.. మరికోందరు ఆయన హాజరును బిసిసిఐ అడ్డుకోవాలని డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారా..? లేదా అన్న అంశం చర్చనీయంశంగా మారింది.

బిసిసిఐలోని ఒక వర్గం మాత్రం శుక్రవారం జరిగే వర్కింగ్ కమిటీ సమావేశానికి శ్రీనివాసన్ ను హాజరుకానీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బిసిసిఐకి నిర్ణయం తీసుకునే అధికారంముందని అంటున్నారు. శుక్రవారం సమావేశంలో ముఖ్యంగా జస్టిస్ లోధా కమిటీ వెలువరించిన తీర్పు నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ట భవితవ్యంపై చర్చించనున్నారు. ఈ రెండు జట్లను రెండేళ్ల పాటు నిషేధించాలని జస్టిస్ లోథా కమిటి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాలు, రోడ్ మ్యాప్ లపై కూడా వర్కింగ్ కమిటీ చర్చించనుంది.

కాగా, ఎన్ శ్రీనివాసన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. క్రికెట్ బోర్డులకు సంబంధించిన అన్ని సమావేశాలకు, కార్యక్రమాలకు దూరంగా వుండాలని చెప్పినా.. ఆయన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరపున వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఆయనను సమావేశానికి హాజరుకాకుండా అడ్డుకోవాలని, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కు శ్రీనివాసన్ కు బదులుగా మరోకరిని పంపించాలని అదేశించాలని పలువురు కమిటీ సభ్యులు కోరుతున్నారు.

గతంలో కోల్ కతాలో జరిగిన సమావేశానికి బరోడా క్రికెట్ అసోసియేషన్ తరపున ఎవరినీ సమావేశానికి హాజరుకానీయకుండా బిసిసిఐ నిర్ణయం తీసుకుందని, అదే విధంగా ఈ సారి కూడా శ్రీనివాసన్ ను సమావేశానికి హాజరుకాకుండా బసిసిఐ చర్యలు తీసుకోవాలని శరద్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయాన్ని వ్యక్తం పర్చారు. ప్రస్తుతం ఆయనపై వున్న కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో వున్నందున ఆయనను సమావేశానికి హాజరుకానీయకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ తరుణంలో బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దానిపై శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  bcci  bcci working committee  bcci working committee meeting  n srinivasan  

Other Articles