AB de Villiers breaks Sourav Ganguly's record, becomes fastest man to score 8000 ODI runs

Ab de villiers breaks sourav gangulys record

record break, sourav ganguly, 8000 runs, india, south africa,cricket, cricket news, south africa vs new zealand 2015, south africa, india, new zealand, sourav gangyly, ab de villiers

Former India captain Sourav Ganguly's record of being the fastest to reach 8000 ODI runs has been broken by the South Africa skipper and stroke-maker AB de Villiers.

సౌరవ్ గంగూలి రికార్డును బ్రేక్ చేసిన డివిలియర్స్

Posted: 08/27/2015 03:45 PM IST
Ab de villiers breaks sourav gangulys record

సౌత్ ఆఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవలే తండ్రైన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్.. మరో అరుదైన ఘనత సాధించడంతో సంతోషంలో మునిగిపోయాడు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్ లలో 8వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా ఏబీ అవతరించాడు. మూడు వన్డల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో హాఫ్ సెంచరీ (64) సాధించిన డివిలయర్స్ ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల రికార్డులను డివిలియర్స్ అధిగమించాడు.

నిన్నటి మ్యాచ్ లో అర్థశతకంతో రాణించిన డివిలియర్స్ 8వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా సౌరవ్ గంగూలి పేరున వున్న రికార్డును డివిలియర్స్ తన పేరున రాసుకున్నారు. గంగూలి 8 వేల పరుగులు మైలురాయిని 200 ఇన్నింగ్స్ తో అందుకోగా, డివిలియర్స్ దానిని కేవలం 182 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది. కాగా అంతకుముందు సచిన్ ఈ ఫీట్ ను 210 ఇన్నింగ్స్ లలో సాధించాడు. మరోవైపు, ఇప్పటికే వన్డే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డులు కూడా డివిలియర్స్ పేరిటే నమోదై వున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ab de villiers  record break  sourav ganguly  8000 runs  india  south africa  cricket  

Other Articles