sachin Tendulkar inagurated sports park in inorbit mall

I like to eat hyderabad biryani sachin tendulkar

sachin Tendulkar inagurated sports park in inorbit mall, I like to eat Hyderabad Biryani says Sachin Tendulkar, telangana, sachin tendulkar, hyderabad biryani, falaknuma palace, pro kabaddi 2015, allu arjun

Master Blaster Sachin Tendulkar inagurated sports park in inorbit mall at hitch city on Tuesday and said that he like to eat Hyderabad Biryani.

హైదరాబాద్ లో సచిన్ సందడి

Posted: 08/04/2015 11:23 PM IST
I like to eat hyderabad biryani sachin tendulkar

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మంగళవారం హైదరాబాదులో అభిమానులను అలరించారు. బిజీ షెడ్యూల్ మధ్యన హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సచిన్ సందడి చేశారు. మాదాపూర్ లో స్మాష్ గేమింగ్ జోన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన హైటెక్ సిటీకి చేరువలో వున్న గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్‌లో నెలకొల్పిన స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ అద్భుత కట్టడమని సచిన్ ప్రశంసించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గడిపిన అనుభూతి మరచిపోలేదని ఆయన చెప్పారు.

తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను ఎప్పుడు నగరానికి వచ్చినా హైదరాబాద్ బిర్యాని తినకుండా వెళ్లనని చెప్పారు. సచిన్‌ను చూసేందుకు అభిమానులు, నగరవాసులు ఎగబడ్డారు. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న సచిన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం కిటకిటలాడింది. ప్రో కబడ్డీ 2015 పోటీలను కూడా ఆయన వీక్షించనున్నారు. మంగళవారం రాత్రి తెలుగు టైటాన్స్ - జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరగనున్న  మ్యాచ్‌ను సచిన్ టెండుల్కర్ వీక్షించనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  hyderabad biryani  falaknuma palace  pro kabaddi 2015  

Other Articles