BCCI And Cricket South Africa Released The Schedules Of India Vs South Africa Matches | Cricket News

India south africa matches schedules released bcci cricket south africa

india vs south africa, india vs south africa schedules, india cricket team, south africa cricket team, south africa india tour, mumbai cricket stadiums, kolkata cricket stadiums, india cricket stadium, hyderabad, vizag, telugu cricket fans

India South Africa Matches Schedules Released BCCI Cricket South Africa : BCCI And Cricket South Africa Released The Schedules Of India Vs South Africa Matches On Monday.

ఇండియా-సఫారీల పోరుకు ఖరారైన ముహూర్తం

Posted: 07/27/2015 05:49 PM IST
India south africa matches schedules released bcci cricket south africa

జింబాబ్వే తర్వాత టీమిండియా సౌతాఫ్రికా జట్టుతో తలపడేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచుల షెడ్యూల్స్ ను తాజాగా బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా సంయుక్తంగా విడుదల చేశాయి. టీమిండియాతో తలపడేందుకు దేశానికి రాబోతున్న దక్షిణాఫ్రికా జట్టు.. 72 రోజులపాటు ఇక్కడే పర్యటించనుంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టీ-20, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ తో సౌతాఫ్రికా పర్యటన మొదలవుతుంది. అయితే.. తెలుగు క్రికెట్ క్రీడాభిమానులకు మాత్రం నిరాశ కలిగించే వార్త ఏమిటంటే.. హైదరాబాద్, విశాఖపట్నంలో ఒక్క మ్యాచ్ కూడా జరగదు.

టీమిండియా-దక్షిణా మధ్య జరిగే సిరీస్ ల షెడ్యూల్స్ :

టీ-20 సిరీస్ :
* తొలి మ్యాచ్ : అక్టోబర్ 2వ తేదీన ధర్మశాలలో జరగనుంది.
* రెండో మ్యాచ్ : అక్టోబర్ 5వ తేదీన కటక్ లో జరగనుంది.
* మూడో మ్యాచ్ : అక్టోబర్ 8వ తేదీన కోల్ కతాలో జరగనుంది.

వన్డే సిరీస్ :
* తొలి మ్యాచ్ : అక్టోబర్ 11వ తేదీన కాన్పూర్ లో జరగనుంది.
* రెండో మ్యాచ్ : అక్టోబర్ 14వ తేదీన ఇండోర్ లో జరగనుంది.
* మూడో మ్యాచ్ : అక్టోబర్ 18వ తేదీన రాజ్ కోట్ లో జరగనుంది.
* నాలుగో మ్యాచ్ : అక్టోబర్ 22వ తేదీన చెన్నైలో జరగనుంది.
* ఐదో మ్యాచ్ : అక్టోబర్ 25వ తేదీన ముంబై లో జరగనుంది.

టెస్టు సిరీస్ :
* తొలి మ్యాచ్ : నవంబర్ 5-9 వరకు మొహాలీలో జరగనుంది.
* రెండో మ్యాచ్ : నవంబర్ 14-18 వరకు బెంగుళూరులో జరగనుంది.
* మూడో మ్యాచ్ : నవంబర్ 25-29 వరకు నాగ్ పూర్ లో జరగనుంది.
* నాలుగో మ్యాచ్ : డిసెంబర్ 3-7 వరకు ఢిల్లీలో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs south africa  bcci  cricket fans  

Other Articles