Ajinkya Rahane to lead India captain where Virat Kohli and MS Dhoni rested | India Zimbabwe Tour

Ajinkya rahane to lead india as captain virat kohli ms dhoni

Ajinkya Rahane news, india zimbabwe tour, mahendra singh dhoni, virat kohli, team india players, india zimbabwe news, rohit sharma, virat kohli updates, mahendra singh dhoni updates, suresh raina

Ajinkya Rahane to lead India as captain Virat Kohli MS Dhoni : Middle order batsman Ajinkya Rahane has been appointed captain of the Indian team for the upcoming tour of Zimbabwe. Virat Kohli and MS Dhoni rested in this tour.

ధోనీ, కోహ్లీలు పక్కకు.. ‘కెప్టెన్’గా రహానే

Posted: 06/29/2015 03:37 PM IST
Ajinkya rahane to lead india as captain virat kohli ms dhoni

టీమిండియా జట్టు ఆటగాడైన అజింక్యా రహానేకి అదృష్టం బాగానే కలిసొచ్చినట్లుంది. అతగాడు ఊహించని ఉన్నత పదవిని అనుకోకుండా అతనిని వరించింది. కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ లేకుండా ఆడబోతున్న ఇండియా క్రికెట్ జట్టుకు అతగాడు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

గతకొన్నాళ్ల నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనపై నెలకొన్న ఉత్కంఠపై స్పష్టత వచ్చేసింది. గతంలో కొన్ని అనివార్య కారణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో టీమిండియా జింబాబ్వే టూర్ ని రద్దు చేయాలని బీసీసీఐ భావించింది. కానీ.. ఇప్పుడు అన్ని సర్దుకోవడంతో ఈ టూర్ ని ఓకే చేసేసింది. ముందు అనుకున్నట్లుగానే వచ్చేనెల 10న ఈ పర్యటన యధావిధిగా ఆరంభమవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఇక ఈ టూర్ కు సందీప్ పాటిల్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఆటగాళ్లను విశ్రాంతి ఇవ్వగా.. మరికొందరు యువఆటగాళ్లకు అవకాశం కల్పించారు.

ఈ జింబాబ్వే టూర్ కు ధోనీ, కోహ్లీ సహా రోహిత్ శర్మ, అశ్విన్, సురేష్ రైనాలకు విశ్రాంతి ఇచ్చినట్లుగా సెలక్టర్లు పేర్కొన్నారు. వారందరూ ఏడునెలలకుపైగా అన్ని ఫార్మాట్ లలోనూ తీరిక లేకుండా మ్యాచులు ఆడినందుకు.. ఇప్పుడు వారికి విశ్రాంతి ఇచ్చారు. నిజానికి జింబాబ్వే టూర్ లో రోహిత్ లేదా రైనాను కెప్టెన్ గా నియామకం చేసి పంపుతారని భావించారు కానీ.. వారిద్దరిని విశ్రాంతి ఇచ్చేసి రెహానేను నియమించారు. ఇక, వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ కు చోటు దక్కింది. ఈ టూర్ లో జింబాబ్వేతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

జింబాబ్వే టూర్ కు వెళుతున్న టీమిండియా జట్టులో.. అజింక్యా రెహానే (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్ లు వున్నారు. ఇందులో వున్న యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లభించదని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajinkya Rahane  mahendra singh dhoni  india zimbabwe tour  

Other Articles