Shivnarine Chanderpaul gets the message on Whatsapp

Shivnarine chanderpaul asked to retire over whatsapp messages

shivnarine chanderpaul, shivnarine chanderpaul cricket, shivnarine chanderpaul retirement, chanderpaul, west indian shivnarine chanderpaul, phil simmons, shivnarine chanderpaul west indies, cricket news, sports news

West Indies legend Shivnarine Chanderpaul had a war of words with coach Phil Simmons over his selection for the series against Australia.

వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం చందర్ పాల్ కు పరాభవం..

Posted: 05/27/2015 08:50 PM IST
Shivnarine chanderpaul asked to retire over whatsapp messages

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం. టైగర్ గా పేరొందిన బ్యాటింగ్ ధీరుడు శివ్ నరేన్ చందర్ పాల్ కు ఆ దేశ క్రికెట్ తో బంధం తెగిపోనుంది. మరో దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రెయిన్ లారా స్కోరుకు రమారమి 86 పరుగుల దూరంలో నిలిచిన చందర్ పాల్ కు వెస్టీండీస్ క్రికెట్ బోర్టు ను పరాభావం ఎదురైంది. ఆయనను ఇకపై ఆట నుంచి విరమణ చెయాల్సిందిగా వాట్సప్ లో మెసేజుల ద్వారా పంపించి ఆయన గత 21 ఏళ్లుగా వెస్టీండీస్ జట్టు కు చేసిన సేవలను మంటగలుతున్నారు. ఇక ఆయన టెస్టు క్రికెట్ ఆటను మనం చూసే వీలుండదు.

వెస్టీండిస్ క్రికెట్ నూతన కోచ్ ఫిల్ సైమన్స్, త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటనకు గాను ఈ నెల 29న జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో తన పేరు వుంటుందని ధీమా వ్యక్తం చేసిన చందర్ పాల్ ను ఆట నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందిగా ఫిల్ సైమన్స్ సూచించారు. 12 వ ఆటగాడిగా కూడా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేమని చెప్పారు. గత ఆరు మ్యాచ్ లుగా అందరి ప్రదర్శన తీరును పరిశీలించి.. ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. అయితే  ధేశం కోసం తమ సర్వశక్తులు ధారపోసిన సీనియర్ క్రికెటర్లకు ఇలా నడిసంద్రంలో పడవలా కాకుండా చక్కగా వీడ్కోలు పలకాలని చందర్ పాల్ కోరుతున్నాడు.

టెస్టు క్రికెట్ లో 51 సగటుతో రాణించిన చందర్ పాల్.. 30 సెంచురీలను కూడా నమోదు చేశాడు. విక్కెట్ల పతనం మధ్య వెయ్యి నిమిషాల పాటు కోనసాగిన దిట్టగా మారాడు. ఆలా నాలుగు పర్యాయాలు నిలిచిన ఆయన సేవలను మరచి వెస్టిండీస్ బోర్డు ఆయనను తప్పుకోమ్మని చెప్పడం బావ్యం కాదని ఆయన అభిమానులు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivnarine Chanderpaul  Whatsapp messages  Phil Simmons  

Other Articles