We still remember loss against MI in 2013 final: Suresh Raina

Mahendra singh dhoni consistent leadership is key to csks success suresh raina

suresh raina, csk suresh raina, suresh raina csk, csk vs mi, mi vs csk, csk mi, mi csk, ipl 8, ipl 2015, indian premier league, cricket news, cricket, MS Dhoni, mahendra singh dhon

Suresh Raina feels that Chennai Super Kings’ stupendous success as the most consistent team in the eight editions of Indian Premier League cricket tournament should be attributed to \their skipper MS Dhoni’s leadership skills.

ధోని వల్లే ఫైనల్ కు చైన్నై సూపర్ కింగ్స్..

Posted: 05/23/2015 11:11 PM IST
Mahendra singh dhoni consistent leadership is key to csks success suresh raina

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనమిదవ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ కు తమ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే కారణమని సహచర ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. గత ఎనిమిది ఎడిషన్లలో చెన్నై నిలకడగా ఆడటం వెనుక ధోనీదే ప్రధాన భూమిక అని స్పష్టం చేశాడు. బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరడంతో ఆ జట్టు ఆటగాళ్లందరూ ధోణికే కితాబిస్తున్నారు. ఈ క్రమంలో ధోనీపై సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు.
 
'ధోనీ నిలకడైన కెప్టెన్. ఆలాంటి కెప్టెన్ చెన్నై కు ఉండటం అదృష్టం. ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో ఆరుసార్లు ఫైనల్ కు వెళ్లడమే ఇందుకు ఉదాహరణ' అని రైనా తెలిపాడు. అయితే మరోసారి ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధం అవుతున్నట్లు సురేష్ రైనా తెలిపాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చేజార్చుకున్న సంగతి ఇంకా తమ మదిలో మెలుగుతుందని సురేష్ రైనా తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suresh raina  chennai super kings  MS dhoni  IPL8-2015  IPLT20  IPL-8  

Other Articles