Kieron Pollard Tapes His Mouth Controversy | Royal Challengers Bangalore Mumbai Indias

Kieron pollard tapes his mouth after warning from umpire

Kieron Pollard news, Kieron Pollard controversy, Kieron Pollard tapes his mouth, Kieron Pollard updates, Kieron Pollard match, Kieron Pollard innings, harbhajan singh news, mumbai indians team

Kieron Pollard Tapes His Mouth After Warning From Umpire : The West Indians have a quirky sense of humour and that is no secret. Kieron Pollard displayed that virtue to a packed house at the Chinnaswamy stadium on Sunday.

నోటికి ప్లాస్టర్ తో పొలార్డ్ వినూత్న నిరసన

Posted: 04/20/2015 03:19 PM IST
Kieron pollard tapes his mouth after warning from umpire

వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అప్పుడప్పుడు కాస్త విచిత్రంగా వ్యవహరిస్తుంటాడు. మ్యాచ్ గెలిచినప్పుడు తన ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరిచే ఈ క్రికెటర్.. ఓడిపోయినప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తుంటాడు. అంతేకాదు.. తనకు కోపమొచ్చినప్పుడల్లా ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం ఇతనికి అలవాటు! కానీ.. ఇలా ప్రతిసారీ నోరుపారేసుకుంటే ఎవరుమాత్రం ఊరికేవుంటారు చెప్పండి! అందుకే.. తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని అంపైర్లు సూచించగా.. మనోడు దానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టాడు. అదే ఇప్పుడు క్రికెట్ జగత్తులో హాట్ టాపిక్ గా మారింది.

ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 209 పరుగులు చేయగా.. 210 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగుళూరు ఆటగాళ్లు క్రీజులోకి వచ్చారు. ఈ క్రమంలోనే ముంబై బౌలర్ లసిత్ మలింగ ఓపెనర్ మూడో ఓవర్ ను వేయగా.. క్రిస్ గేల్ మెయిడెన్‌గా ఆడాడు. అంతే! పొలార్డ్ తన దేశానికి చెందిన క్రిస్ గేల్ దగ్గరికి వెళ్లి పొలార్డ్ నోరు పారేసుకున్నాడు. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. అయితే.. వీరిద్దరిలో పొలార్డ్ దే తప్పు వుందని భావించిన ఆన్‌ఫీల్డ్ అంపైర్లు.. పొలార్డ్‌ను కామ్‌గా ఉండమని చెప్పారు. దీంతో కోపానికి గురైన కీరన్ పొలార్డ్.. డగౌట్‌కు వెళ్లి నోటికి ప్లాస్టర్ వేసుకొని వచ్చాడు. అప్పటినుంచి ఇది సంచలన వార్తగా మారింది.

ఇదిలావుండగా.. పొలార్డ్ చేపట్టిన ఈ వినూత్న నిరసనను హర్భజన్ సింగ్ సమర్ధించాడు. ‘అతనిని అంపైర్ కామ్‌గా ఉండమని చెప్పాడు. ఆ క్రమంలోనే అతను నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఇందులో తప్పేముంది. అలా చేయడం అతనికిష్టం అనిపించింది.. చేశాడు.. అంతే!’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. ‘హై ఓల్టేజ్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్‌లో ఏదోక ప్రత్యేకతతో పొలార్డ్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. వెస్టిండీస్ ఆటగాళ్లు భిన్నంగా కనిపిస్తూ ఉండటం నిజంగా మంచి అలవాటు’ అంటూ భజ్జీ అభివర్ణించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kieron Pollard  Harbhajan Singh  Mumbai Indians  

Other Articles