BCCI President keeps speculation alive of Ganguly coaching Indian Team

Hearing this for the first time ganguly on team india coaching job links

saurav ganguly to coach Indian cricket team, Indian cricket team coach Sachin Tendulkar, Indian bating legend Sachin Tendulkar, Indian fans to see Sachin Tendulkar as coach, Indian cricket team coach, team india coach, BCCI, Cricket, Duncan Fletcher, India, India coach, Jagmohan Dalmiya, Sourav Ganguly, Sports, Rahul dravid, Jagmohan Dalmiya, Team India, BCCI

Former India skipper Sourav Ganguly preferred to remain tight-lipped on whether he is a possible contender for next coach of the Indian cricket team.

టీమిండియా కోచ్ గా నేఃనా..? తొలిసారి వింటున్నా.. గంగూలీ అశ్చర్యం..!

Posted: 04/17/2015 10:02 PM IST
Hearing this for the first time ganguly on team india coaching job links

భారత క్రికెట్ టీమ్ కు తదుపరి కోచ్ గా పని చేసేందుకు తాను అసక్తి చూపుతున్నానంటూ కథనాలు వచ్చిన వార్తలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కథనాలను తాను తొలిసారిగా వింటున్నానని చెబుతూ.. సమాధానాన్ని దాట వేశారు. మీరు కోచ్ రేసులో ముందున్నారా..? లేక రేసులోనే లేరా..? అన్న మీడియా ప్రశ్నలపై స్పందించిన దాదా కోచ్ పదవిపై తాను ఇప్పేడే ఏమీ మాల్లాడనన్నారు. అయితే కోచ్ విషయంలో వస్తున్నవన్నీ కట్టుకథలేనని చెప్పారు. ఇలాంటి ప్రచారాలను కట్టిపెట్టాలని, ప్రసారం చేస్తూ ప్రచారం చేయవద్దని కూడా సూచించారు.

ఈ పదవి కోసమే బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ ధాల్మియాను కలిసి చర్చలు జరిపి ఖరారు చేసుకున్నారన్న మీడియా ప్రశ్నలపై స్పందించిన గంగూలీ.. అలాంటిదేమీ లేదని.. తాము ప్రతీ రోజు కలుసుకుంటామని చెప్పారు. దాల్మీయా బిసిసీఐ అద్యక్షుడు కాగా, తాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ప్రతీ రోజు కలుస్తుంటామన్నారు. అయితే రాహుల్ ద్రావీడ్ కూడా ఈ పోటీలో వున్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, ఇద్దరం మంచి కోచ్ లు కాగలం.. రాహుల్ గోప్ప బ్యాట్స్ మెన్ అని దాదా సమాధానమిచ్చాడు. అటు దాల్మీయా వద్ద గంగూలీ విషయాన్ని ప్రస్తావించిన మీడియాతో.. తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలదని, ఇంత వరకు అలాంటిదేమీ లేదని, కానీ త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని దాల్మియా చెప్పారు.

ప్రస్తుతం భారత టీం కోచ్గా వున్న డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగియడంతో.. ఈ స్థానంలో ఎవరు వస్తారోనన్న ఊహగానాలపై రోజుకో రకమైన కథనాలు వెలుగుచూస్తున్నాయి. తొలుత భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ స్థానాన్ని భర్తీ చేస్తారని కథనాలు, ఆ తరువాత టీమిండియా మరో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఈ స్థానాన్ని భర్తీ చేస్తారన కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ స్థానానికి తాను పోటీలో వున్నానని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బరిలోకి దిగడంతో.. ఈ దిగ్గజ త్రయం నుంచి కోచ్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశం ఉత్కంఠకు దారి తీస్తోంది.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  india  bcci  cricket  duncan flecther  coach  

Other Articles