Michael Clarke | Test | Australia

Michael clarke said his next target is to the top rank in test series

australia, michael clarke, testseries, one days, southafrica

Australia captain Michael Clarke said his next target after winning the World Cup in his last one-day international was to take his team back to the top of the Test rankings.

మైఖేల్ క్లార్క్ తర్వాతి లక్ష్యం ఏంటో తెలుసా..?

Posted: 03/31/2015 04:09 PM IST
Michael clarke said his next target is to the top rank in test series

ఆస్ట్రేలియా ఖాతాలో మరో వరల్డ్ కప్ ను జమ చేసిన సక్సెస్ ఫుల్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వన్డేలకు రిటర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలుసు. అయితే వరల్డ్ కప్ సాధించిన తరువాత తన తర్వాతి లక్ష్యం ఏంటన్నది క్లార్క్ క్లారిటీ ఇచ్చారు. వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తదుపరి లక్ష్యంపై గురిపెట్టాడు. టెస్టుల్లో తన టీమ్ ను టాప్  ర్యాంకుకు తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నాడు. చివరి వన్డేలో చెలరేగి ఆడి జట్టుకు ప్రపంచకప్ అందించాడు క్లార్క్. మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో క్లార్క్ 74 పరుగుల చేసి వన్డే కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు.

వరల్డ్ కప్ ను స్వంతం చేసుకోవడం ద్వారా వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ గా మారింది. కానీ టెస్టుల్లో మాత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు టెస్టులపై దృష్టి పెట్టాడు మైకేల్ క్లార్క్. టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న ఆసీస్ టీమ్ ను అగ్రస్థానానికి తీసుకురావడమే తన ముందున్న టార్గెట్ అని క్లార్క్ వెల్లడించాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ లలో విజయం సాధిస్తామన్న దీమాను వ్యక్తం చేశాడు. వన్డేల నుంచి వైదొలగడంతో తన టెస్టు కెరీర్ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. టెస్టు కమిట్ మెంట్ కారణంగా టి20 లీగ్ ల్లో ఆడే విషయం ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని మైకేల్ క్లార్క్ వెల్లడించారు. మరి క్లార్క్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  michael clarke  testseries  one days  southafrica  

Other Articles