Indian fans wants new zealand to win world cup | cricket

Indian fans wants new zealand to win world cup

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Indian fans wants new zealand to win world cup rather than australia, which beat india in semi finals by 95 runs

ఫైనల్స్ లో ఇండియన్ ఫాన్స్ ఫేవరెట్ టీంగా న్యూజీలాండ్

Posted: 03/28/2015 08:49 PM IST
Indian fans wants new zealand to win world cup

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో రెండు అతిధ్య జట్లు.. అదీకాకా దాయాది దేశాల మధ్య జరుగుతున్న జగజ్జేత పోరులో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ విజయం సాధించాలని అధికమంది భారతీయులు కోరుకుంటున్నారు. ఆసియా ఖండానికి చెందిన అన్ని జట్టు క్వార్టర్స్ లోనే తిరుగుముఖం పట్టగా, భారత్ మాత్ర సెమీస్ లో ఇంటి దారి పట్టింది. అయితే సెమీస్ లో ధోని సేను ఓడించిన అసీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కప్ గెలవకూడదని, తమ మద్దతు అంతా న్యూజీలాండ్ కేనని అధిక శాతం మంది భారత క్రికెట్ అభిమానులు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు.

ఇక న్యూజీలాండ్ కప్ గెలవాలని అనడానికి మరో కారణం కూడా వుందట. ప్రపంచ క్రికెట్ క్రీడలోకి దశాబ్దాల క్రితం అడుగుపెట్టి.. తమ సత్తాను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నా.. 1983 నుంచి ఇప్పటి వరకు న్యూజీలాండ్ ప్రపంచ కప్ సెమీస్ లోకి అడుగుపెట్టలేదు. గత పాత చరిత్రను చెరిపేసుకుని కొత్త రికార్డులను సృష్టించుకుంటూ. ఈ సారి న్యూజీలాండ్ సెమీస్ తో పాటు ఫైనల్స్ కు చేరుకుంది. రాక రాక వచ్చిన అవకాశాన్ని న్యూజీలాండ్ నూటికి నూరు శాతం వినియోగించుకోవాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

అంతేకాదు పూల్ ఏ లోని రెండు జట్లు లీగ్ దశలో తలపడినప్పుడు అస్ట్రేలియాను ఒక్క విక్కెట్ తేడాతో ఓడించిన అనుభవం వున్న న్యూజీలాండ్ మరోమారు అసీస్ పై విజయాన్ని నమోదు చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఫైనల్స్ లోకి తొలిసారిగా అడుగుపెట్టిన న్యూజీలాండ్ పై తీవ్రమైన ఒత్తిడి వుంటుందని, ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తడికి లోను కాకుండా జగజ్జేతగా నిలవాలని భారతీయ క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా, చాలాకొద్ది మాత్రం అసిస్ కప్ గెలిచి ఫిలిప్ హ్యూస్కు అంకితమివ్వాలని అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  michael clarke  retirement  

Other Articles