Aussie captain Michael Clarke to retire from ODIs after World Cup final

Aussie captain michael clarke to retire from odis after world cup final

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Australian captain Michael Clarke has announced that the World Cup final against New Zealand on Sunday will be the last time he plays ODI cricket. Clarke made the announcement at the pre-match press conference on the eve of the final in Melbourne.

న్యూజీలాండ్ తో జరిగేదే ఫైనల్. తరువాత వన్డేలకు గుడ్ బై

Posted: 03/28/2015 08:48 PM IST
Aussie captain michael clarke to retire from odis after world cup final

ఐసీసీ ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఆదివారం మెల్ బోర్న్ లో దాయాది దేశం న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లలో జగజ్జేత్త ఎవరనేది తేలిపోనుంది. కాగా ఆదే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించారు. ఫైనల్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం భారత్ తో మ్యాచ్ గెలుపోందిన రోజునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. రేపటి మ్యాచ్ తో తాను మొత్తం 245 వన్డే మ్యాచ్ లలో పాల్గోన్నట్లు అవుతుందన్నారు.

తన బ్యాటింగ్తో ఎన్నో సందర్భాల్లో ఆసిస్ని విజయతీరాలకు చేర్చిన క్లార్క్ తన నిర్ణయాన్ని తన సహచర క్రీడాకారులకు కూడా చెప్పానన్నారు. వారితో పాటు అస్ట్రేలియా క్రికెట్ బోర్డు సభ్యులు రాడ్ మార్ష్, జేమ్స్ సూధర్ లాండ్, డారెన్ లహ్మాన్ లతో కూడా మాట్లాడి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అనూహ్యంగా తాను ఈ ప్రకటన చేయడంతో జట్టు సభ్యులు కూడా కొంత నిరాశకు గురయ్యారని చెప్పారు. 21 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొంది గత 12 ఏళ్లగా తమ దేశానికి క్రీడారంగంలో ముఖ్యంగా క్రీకెట్ లో అవకాశం లభించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఈ క్రమంలోనే తనకు నాలుగేళ్ల కిందట కెప్టన్ గా అవకాశం లభించిందని చెప్పారు. తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇది సరైన సమయం అని భావిస్తున్నానట్లు చెప్పుకోచ్చాడు. 2019లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ వరకు తాను ఫిట్ గా వుండగలనని, క్రికెట్ ఆగడలనని భావించడం లేదని, అందుచేతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. క్లార్క్ 244 వన్డే మ్యాచ్లు ఆడి 7,907 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 130 పరుగులు నమోదు చేసిన క్లార్క్ 8 శతకాలు, 57 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే టెస్ట్ మ్యాచ్లలో కొనసాగనున్నట్లు చెప్పారు. టెస్టుల్లో 108 మ్యాచ్లు ఆడి 8,432 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 329 పరుగులు చేశాడు. కాగా అసీస్ కెప్టెన్ గా 73 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించిన క్లార్క్ అందులో 49 మ్యాచ్ లను గెలపించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  michael clarke  retirement  

Other Articles