MS Dhoni avoids retirement talk

Ms dhoni avoids retirement talk

MS Dhoni, India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015,

India captain Mahendra Singh Dhoni refused to give an indication whether he will retire from one-day cricket after his team lost the World Cup .

నో రిటైర్మెంట్.. టీ 20కి సన్నధమవుతాం: ధోణి

Posted: 03/26/2015 08:32 PM IST
Ms dhoni avoids retirement talk

ప్రపంచ కప్ లో ఇవాళ సిడ్నీ వేదికగా అతిథ్య జట్టు అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒత్తడి వల్లే ఓటమిపాలయ్యామని ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి అన్నారు. 95 పరుగులతో అసీస్ చేతిలో ఓటమి పాలైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసీస్ తో జరిగిన ఉత్కంఠకర పోరులో తాము ఒత్తిడిని అధిగమించలేకపో్యామని అంగీకరించాడు. ధీటైన బ్యాట్స్ మెన్లు వున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని స్పష్టం చేశాడు.

ఛేజింగ్లో భారత ఓపెనర్లు శుభారంభం అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాట్స్ మెన్లపై ప్రతికూల ప్రభావం చూపిందని ధోనీ చెప్పాడు. తాను కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోయానని అన్నాడు. భారత్ కు చేరుకోగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? అన్న ప్రశ్నకు స్పందించిన ధోని.. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడుతానని చెప్పాడు. ఫిజికల్ ఫిట్ నెస్ సరిగ్గా వుంటే ఆ తర్వాత మరో పర్యాయం రానున్న 2019 ప్రపంచ కప్లో ఆడాతానన్నారు. అయితే ఈ విషయమై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు భారత జట్టుకు అండగా నిలిచి.. మ్యాచ్ ఆధ్యంతం తమకు మద్దతు పలికిన క్రీడాభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  2003 semi final result  

Other Articles