Australia post cricket world cup record score v afghanistan

Australia versus afghanitan, australia vs afghanitan, david warner, david warner score, glenn maxwell, srilanka, India, south africa, bermuda, netherlands, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, australia, australia CWC 2015, Live Scores, Live Updates, afgahnistan, afgahnistanCWC 2015, Sports, World Cup Live

Australia posted the highest total in Cricket World Cup history as they scored 417-6 in their Pool A match against Afghanistan in Perth.

పసికూన అఫ్ఘనిస్థాన్.. అసీస్ రికార్డు విజయం

Posted: 03/04/2015 09:07 PM IST
Australia post cricket world cup record score v afghanistan

ప్రపంచ కప్ టార్నమెంటులో పసికూనలపై అగ్రజట్టు పరుగుల సునామీని సృష్టిస్తున్నాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అప్ఘానిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడారు. ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా అప్ఘాన్ తో బుధవారం పెర్త్ లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్ఘనిస్థాన్ మూడో ఓవర్ లో విక్కెట్ లభించినా.. ఆ ఆనందం కొంతసేపు మాత్రమే నిలిచింది. ఆ తరువాత అసీస్ బౌలర్లు దాటిగా ఆడి పరుగుల వరదను సృష్టించారు.  ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో కంగారూలు 275 పరుగుల భారీ తేడాతో అఫ్ఘాన్పై రికార్డు విజయం సాధించారు వన్డే క్రికెట్లో పరుగుల అంతరంలో ఆసీస్కిదే భారీ విజయం. గతంలో నంబియాపై 256 పరుగుల తేడాతో గెలిచిన కంగారూలు ఆ రికార్డును మెరుగుపరచుకున్నారు.

మరోవైపు అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్లో ఆస్ట్రలియా రికార్డుల మోత మోగించింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. ఇంతకుముందు భారత్ (413) పేరిట ఉన్నరికార్డు  తెరమరుగైంది. ఇక ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్మన్గా వార్నర్ (178) రికార్డు సృష్టించాడు. గతంలో మాథ్యూ హేడెన్ (158) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక ఆసీస్ తరపున వార్నర్, స్మిత్ అత్యధిక (260) భాగస్వామ్యం నెలకొల్పారు. అసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 178 పరుగులు సాధించి కొద్దిలో డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు.  ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ (133 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 178) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వార్నర్..  స్టీవెన్ స్మిత్ (95)తో కలసి 260 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో మ్యాక్స్వెల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్ఘాన్ బౌలర్లు షాపూర్, దావ్లత్ చెరో రెండు వికెట్లు తీశారు. చివర్లో మ్యాక్స్వెల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్ఘాన్ బౌలర్లు షాపూర్, దావ్లత్ చెరో రెండు వికెట్లు తీశారు.

418 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన అఫ్టనిస్థాన్.. అసీస్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. అఫ్ఘానిస్తాన్ 37.3 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్ఘాన్ జట్టులో అఫ్ఘాన్ జట్టులో నవ్రోజ్ మంగల్ (33) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు జాన్సన్ నాలుగు, హజ్లెవుడ్, స్టార్క్ రెండేసి వికెట్లు తీశారు. వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Australia  Afghanistan  

Other Articles