Sachin tendulkar announces contest for fans

Sachin Tendulkar announces contest for fans, Sachin fans contest, Tendulkar contest for fans, Sachin Tendulkar, hard time for sachin fans, sachin movie bases on his autohbiography, sachin movie title contest, first asian captured in movie, first Asian to join famous personalities, 200 NOT OUT, James Erskine, Komal Nahta, Ravi Bhagchandka, sachin twitter, sachin tendulka twitter account, sachin tendulkar records, sachin tendulkar achivements

Tendulkar has announced on Twitter that he would love to “involve” his fans, and has asked for their suggestions regarding what the name of the docu-feature can be.

కాంటెస్ట్ గెలవండి.. గిఫ్ట్ అందుకోండి..!

Posted: 03/04/2015 05:29 PM IST
Sachin tendulkar announces contest for fans

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం ఉదయాన్నే తన అభిమానులకు షాకింగ్ న్యూస్ అందించారు. అదేంటో తెలుసా..? తన అభిమానులందరికీ పెద్ద కాంటెస్ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే అది క్రికెట్ పైనే వుంటుందని, అందులోనూ సచిన్ ఆడిన మ్యాచ్ లపైనూ వుంటుందని ఊహించుకోమాకండి. ఎందుకంటే అది ఎంత మాత్రం కాదు కాబట్టి. క్రికెట్ దిగ్గజం సచిన్ పెట్టే కాంటెస్ట్ దేనిపై వుంటుంది..? అంటూ ఆలోచనలోకి వెళ్లబాకండి.

సచిన్ టెండూల్కర్ త్వరలో తన జీవిత విశేషాలతో కూడిన డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించనున్నారన్న విషయం తెలిసిందే కదా.. 200 నాటౌట్ ఫిల్మ్స్ ప్రోడక్షన్ సంస్థ సచిన్ తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు హక్కులు తీసుకుంది. ఈ చిత్రాన్ని ఈఎంఆర్, ది హ్యూమన్ ఫేస్, వన్ నైట్ ఇన్ టురిన్ వంటి చిత్రాలను రూపొందించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ ఎర్క్ సన్ .సచిన్ జీవితంపై డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపోందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విశేషాలను చిత్ర ఎడిటర్, ఫిల్మ్ ఇన్ ఫార్మేషన్ పబ్లిషర్ కోమల్ నాహ్టా మాట్లాడుతూ.. సచిన్ జీవితాన్ని కథగా తీసుకుని తెరకెక్కించడంతో ఆయన మరో రికార్డును సృష్టించారన్నారు. దీంతో తొలి ఆసియా ఖండ వ్యక్తిగా సచిన్ రికార్డు చేపట్టనున్నారన్నారు. ఇదంతా బాగానే వుంది కానీ అసలు విషయమేమిటంటారా..? అక్కడికే వస్తున్నాం..

sachin

 ఈ డాక్యుమెంటరీకి ఏ పేరు పెడితే బాగుంటుందో తెలియజేయాల్సిందిగా అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా సచిన్ సలహా కోరారు. తన చిత్రంలో అభిమానులందరూ కలిసి చేయాలని అనుకుంటున్నానంటూ మరో ట్విట్ లో పోస్టు చేశారు. ఈ సినిమాకి ఏ పేరు పెడితే బాగుంటుంది. మీ ఆలోచనలు తనకు పంపండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదండోయ్.. తన సినిమాకి అత్యంత ఆదర్శ టైటిల్‌తో వచ్చిన వారి కోసం స్టోర్‌లో చాలా ప్రత్యేకమైన రెడీగా వుందని.. త్వరగా తాను అభిమానుల నుండి టైటిల్ వినడానికి వేచి ఉన్నానంటూ మరో ట్వీట్ చేశారు. మరెందుకు ఆలస్యం ఇక పెన్నూ పెపరు తీసుకుని మంచి టైటిల్ గురించి ఆటోచించండి..!

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  200 NOT OUT  James Erskine  Komal Nahta  Ravi Bhagchandka  

Other Articles