Dalmiya returns as bcci president

Jagmohan Dalmiya, bcci, chennai, cricket, srinivasan, bcci elections, supreme court on srinivasan, sanjaypatel, bcci secretery

After a gap of over 10 years, seasoned cricket administrator Jagmohan Dalmiya made a comeback as full-time president of the cricket board at its AGM on Monday. While Sanjay Patel stayed as secretary of the board, Anirudh Choudhary was elected as the treasurer.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాల్మియా.. సెక్రటరిగా సంజయ్ పాటిల్

Posted: 03/02/2015 12:21 PM IST
Dalmiya returns as bcci president

బిసిసిఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికయ్యారు. రొటేషన్ విధానాన్ని అనుసరించి, ఈసారి అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఈస్ట్‌జోన్ ప్రతిపాదించాలి. బిసిసిఐ అధ్యక్ష పదవి కోసం దాల్మియా నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దీనితో అతను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.  70 ఏళ్ల దాల్మియా పేరును ఈస్ట్‌జోన్ నుంచి ఒకరు ప్రతిపాదించగా, మరొకరు మద్దతునిచ్చారు. ఈ జోన్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత బలమైన బెంగాల్ క్రికెట్ సంఘంకి దాల్మియా అధ్యక్షుడిగా ఉన్నాడు.

బిసిసిఐ ఎన్నికల్లో మాజీ బిసిసిఐ చైర్మెన్ శ్రీనివాసన్ పోటీ చేసేందుకు అనర్హుడని కోర్టు తేల్చిచెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీకి దూరమైన శ్రీని, దాల్మియాకు తన మద్దతును ప్రకటించాడు. ఈ నిర్ణయం తీసుకోకపోతే, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆ పదవిని దక్కించుకుంటాడన్న భయం శ్రీనివాసన్ లో ఉందని కొందరు శ్రీని దగ్గరి వారి భావన. గతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో శ్రీనివాసన్ కు తను మద్దతుగా నిలిచారు దాల్మియా.  దాల్మియాను అధ్యయ పీఠంపై కూర్చోపెడితే, బోర్డుపై పరోక్షంగా తన పెత్తనం కొనసాగించవచ్చని శ్రీని భావిస్తున్నట్లు సమాచారం. దాల్మియా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికల కాగా, సంజయ్ పాటిల్ బిసిసిఐ బోర్డ్ సెక్రటరిగా ఎన్నికయ్యారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagmohan Dalmiya  bcci  chennai  cricket  srinivasan  bcci elections  sanjay patel  

Other Articles