De villiers smashed the second fastest century

South Africa captain AB De Villiers smashed the second fastest World Cup century off 52 balls in the Pool B game against the West Indies at the Sydney Cricket Ground.

De Villiers smashed the second fastest century

విజృంభించిన డివిలియర్స్.. 408 పరుగులతో మోతమోగించిన సౌతాఫ్రికా

Posted: 02/27/2015 01:44 PM IST
De villiers smashed the second fastest century

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సునామీలాగా భారీగా పరుగులు చేసింది. వరల్డ్‌కప్-2015లో ఇంతటి భారీ స్కోర్‌ను ఏ జట్టు చేయలేదు. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. విండీస్ విజయలక్ష్యం 409 పరుగులు.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ పరుగుల వర్షం కురిపించాడు. 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో రెండో వేగవంతమైన శతకం ఇది. డివిలియర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశారు. అందులో 17 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. కుక్ 12, ఆమ్లా 65, ప్లీసిస్ 62, రోసావ్ 61, మిల్లర్ 20, బెహ్రాడీన్ 16 పరుగులు చేశారు. హోల్డర్ 2, టేలర్ ఒక వికెట్ తీసుకున్నారు.

వరల్డ్ కప్ లొ రికార్డుల మోత మోగుతోంది. గత మ్యాచ్ లో డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించారు క్రిస్ గేల్.  వరల్డ్ కప్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ డివిలియర్స్ నమోదు చేశారు. చివరి ఓవర్లో నాలుగు సిక్సులతో మొత్తం 30 పరుగులు తీశారు.  అయితే అత్యధిక రన్స్ రికార్డును మాత్రం దాటలేదు. 413 పరుగులతో ఇండియా పేరు మీదున్న రికార్డు బద్దలవుతుందని అందరు ఆకస్తిగా చూసినా, చివరకు నిరాశే మిగిలింది. ఓవర్స్ అయిపోవడంతో సౌతాఫ్రికా రికార్డును బద్దలుకొట్టలేకపోయింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : De Villiers World Cup South Africa West Indies  

Other Articles