Dwayne bravo quits tests

Dwayne Bravo quits Tests, West Indies allrounder Dwayne Bravo, Bravo last Test match was against Sri Lanka, Bravo ommision from world cup, eleventh icc cup, Bravo not in team, 2015 cricket world cup schedule, icc cricket world cup 2015 groups, cricket world cup 2015 venue, 2015 cricket world cup match schedule, wc 2015 cricket schedule, Bravo latest news, Bravo achivements, Bravo records, Bravo test records

West Indies allrounder Dwayne Bravo has called time on his Test career. Bravo, whose last Test match was against Sri Lanka in December 2010, made the announcement through a statement early on Saturday and said he had already informed the West Indies team about his decision

టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బ్రావో

Posted: 01/31/2015 07:44 PM IST
Dwayne bravo quits tests

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇవాళ ఉదయం ఆయన తన రిటైర్మెంట్ కు సంబంధించిన అంశాన్ని ప్రకటించారు. గత నాలుగేళ్లుగా టెస్టు మ్యాచ్ లకు దూరంగా వున్న బ్రావో చివరి సారిగా 2010 డిసెంబర్ మాసంలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆడాడు. అప్పటి నుంచి తాను టెస్టు మ్యాచ్ లకు దూరంగానే వున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తాను టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెబుతన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇదివరకే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సభ్యులతో చర్చించానని కూడా తెలిపాడు.

31 ఏళ్ల వయస్సున్న బ్రావో.. తన కెరీర్లో  40 టెస్టులు ఆడి, 87 విక్కెట్లు తీసుకోవడంతో పాటు.. 2200 పరుగులను కూడా సాధించాడు. టెస్టుల నుంచి వైదొలగి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నట్టు ప్రకటించాడు. తన టెస్టు కెరీర్ లో విజయంతో పాటు పలు పరాభవాలను కూడా తాను చవిచూసినట్లు చెప్పుకోచ్చాడు. గెలుపులతో వచ్చిన ఆనందాలతో పాటు మ్యాచ్ ఓటములతో టీమ్ పడిన ఆవేదనలను కూడా తాను పంచుకున్నానని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా తాను గొప్ప ఉత్సాహంతో, లోతైన అవగాహనతో ఉత్తమ క్రికెట్ ను ఆడానని చెప్పుకోచ్చారు. చివరికి తాను ఈ క్రీడా విభాగంతో తన దేశ ప్రజలకు తరపున తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానన్న విషయాన్ని తెలిపాడు.

విజయాలను ఆస్వాధించిన క్రమంలో తాను పొందిన ఆనందాలు చిరస్థాయిగా గుర్తుంటామని చెప్పాడు. కాగా ప్రస్తుతం తాము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటున్నామని, మళ్లీ ఆ రోజులు వెనక్కు రావాలంటే తాము అంతే ప్రేమగా క్రీడను ఆడాల్సివుందని తెలిపారు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో మరో ఏడాది పాటు ఒప్పందం ఉందని ఈ క్రమంలో తాను వన్డే మ్యాచ్ లతో పాటు టీ 20 మ్యాచ్ లను మాత్రమే ఆడనున్నట్లు తెలిపాడు.. కాగా పదకొండవ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జట్టుకు బ్రావోకు స్థానం లభించక పోవడమే తన ఈ నిర్ణయానికి కారణమన్న అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwayne Bravo  ICC world cup 2015  Westindies cricket team  test cricket  

Other Articles