Sachin tendulkar named ambassador for 2015 icc world cup

Sachin Tendulkar ambassador, Tendulkar ambassador 2015 ICC World Cup, sachin ambassador, Tendulkar icc world cup ambassador, sachin Tendulkar, International cricket council, ICC, David Richardson, Cricket World Cup, second successive time, India maestro ICC' Ambassador, Indian cricket icon Sachin, Indian cricket icon Tendulkar

Indian cricket icon Sachin Tendulkar, who is the all-time leading run-getter in World Cup history, was today named the event's ambassador for the second successive edition.

2015 క్రికెట్ ప్రపంచ కప్ కు అంబాసిడర్ గా సచిన్

Posted: 12/22/2014 05:15 PM IST
Sachin tendulkar named ambassador for 2015 icc world cup

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కు అరుదైన గౌరవం లభంచింది. వరుసగా అయన రెండో పర్యాయం కూడా ప్రపంచ క్రికెట్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్నకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంబాసిడర్గా నియమితులయ్యారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. గత పర్యాయం 2011లో జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ కు కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

అయితే ఆ కప్ లో భారత్ తరపున సచిన్ క్రికెట్ ఆడటం.. కప్ ను కూడా కైవసం చేసుకోవడంతో.. సచిన్ అంబాసిడర్ గా వ్యవహరించాడన్న విషయం కూడా మర్చిపోయారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కూడా సచిన్ ను అంబాసిడర్ గా నియమిస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్దే. కాగా, ప్రపంచ కప్ ముగిసిన అనంతరం రిటైర్ మెంట్ ప్రకటించిన సచిన్ ను మరోసారి అంబాసిడర్ గా ఐసిసి నియమించింది. సచిన్ టెండూల్కర్ అంబాసిడర్ హోదాలో పలువరు ఐసిసి తరపును చోరవ తీసుకుని క్రికెట్ ప్రారంభకులకు ఆట పట్ల ఆసక్తిని కల్పించడం, ప్రోత్సహించడంతో పాటు మద్దతు కల్పించనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin Tendulkar  ambassador  2015 ICC World Cup  cricket  

Other Articles