Bcci submits supreme court commercial interest cricketers list

bcci commercial persons list, bcci commercial interest persons, bcci double conflict persons, supreme court on sunil gavaskar, supreme court on bcci, supreme court ipl scam latest update, ipl scam updates, india vs australia test match latest updates, india cricket latest updates, sports news updates

bcci submits supreme court commercial interest cricketers list : BCCI submitted a list of those who have commercial interest in cricket. sunil gavaskar, ravi shastri, k.srikkanth krishnama chary, venkatesh prasad and others named in bcci commercial interest persons list

బిజినెస్ మెన్ల చేతుల్లో జెంటిల్మెన్ గేమ్

Posted: 12/17/2014 02:45 PM IST
Bcci submits supreme court commercial interest cricketers list

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. ఇది ప్రభుత్వ సంస్థ కాకపోయినా.., ఎన్ని ప్రభుత్వాలు మారినా సంఘాన్ని గౌరవిస్తూ వచ్చాయి. అయితే దేశ క్రికెట్ పై మాయని మచ్చలా పడిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తో బీసీసీఐ అసలు రంగు బయట పడింది. ఇంటి పెద్దలే.., దొంగతనాలకు పాల్పడిన వైనం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని చెప్తుంటే.., ఆటతో వ్యాపారం చేసే బిజినెస్ మెన్లు కొందరు బోర్డుకు కలంకం తీసుకొచ్చారు. తమ స్వప్రయోజనాల కోసం జట్టును వాడుకుని కోట్ల మంది అభిమానులున్న టీమ్ ఇండియాను లీడ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు..., టైం వచ్చినప్పుడల్లా బీసీసీఐపై విమర్శలు చేస్తుంది. తాజాగా, బీసీసీఐలో ఉంటూ ద్వంద ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తుల వివరాలు కోరగా.., జాబితాను రూపొందించిన బోర్దు కోర్టుకు సమర్పించింది. ఈ లిస్ట్ చూస్తే బోర్డులో ప్రముఖుల ముఖాలన్నీ ఆటతో బిజినెస్ చేసే వారి లిస్ట్ లో దర్శనం ఇస్తున్నాయి. దీంతో అంతా విస్తుపోతున్నారు. బిజినెస్ మెన్లు ఎలా జెంటిల్మెన్ గేమ్ ను క్లీన్ గా నడుపుతారు అని ప్రశ్నలు వస్తున్నాయి. బీసీసీఐకి ఇచ్చిన లిస్ట్ లో సునీల్ గవాస్కర్, రవి శాస్ర్తి, కె.శ్రీకాంత్, కృష్ణమాచారి, వెంకటేశ్ ప్రసాద్, లాల్ చంద్ రాజ్ పుత్, సౌరవ్ గంగూలీ తదితరుల పేర్లు ఉన్నాయి.

లిస్ట్ లో ఉన్న శ్రీకాంత్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ బాద్యతలు చూసుకుంటున్నాడు. అంతేకాకుండా ఇతను చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఇక శ్రీనివాసన్ గురించి చెప్పనవసరం లేదు. బీసీసీఐ కి గతంలో చైర్మన్ గా పనిచేయటంతో పాటు ఓ టీంలో వాటా కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఇండియా సిమెంట్స్ సంస్థను నిర్వహిస్తున్నాడు. దీనికి క్రికెటర్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ఇలా ఇద్దరి మద్య పలు వ్యాపార సంబంధాలు బయటపడ్డాయి. ఇలా ప్రతి ఒక్కరూ క్రికెట్ లో కమర్షియల్ కోణాలను ఉపయోగించుకుంటున్నారని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. కోట్ల మంది ప్రజలు ప్రేమించే క్రికెట్ ను ఇలా డబ్బులతో కలుషితం చేస్తున్న వ్యక్తులు బోర్డులో ఉన్నంత కాల బీసీసీఐ అంటే స్నేక్ పూల్ లా ఉంటుంది. బోర్డును ప్రక్షాళన చేసి ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటే పారదర్శకత వచ్చే అవకాశం ఉంది. దీనిపై సుప్రీం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci commercial persons  sunil gavaskar business  ipl spot fixing  

Other Articles