India vs australia second test brisbane gabba pitch

india vs australia second test match, india vs australia match updates, india vs australi test match schedule, india vs australia test match updates, dhoni on brisbane gabba stadium, indian cricket latest updates

india vs australia second test brisbane gabba pitch : india have a challage of gabba pitch which is going to venue for india vs australia second test match, team india captain dhoni confidant on gabba stadium victory says new ground is a new challage for fresh players but they can do better performance

సెకండ్ టెస్ట్ కు సవాళ్లు.. చరిత్ర తిరగరాస్తామన్న ధోనీ

Posted: 12/16/2014 01:46 PM IST
India vs australia second test brisbane gabba pitch

పరాయి గడ్డపై టీమ్ ఇండియా వరుసగా సవాళ్ళు ఎదుర్కుంటోంది. తొలి మ్యాచ్ అనూహ్యంగా ఆస్ర్టేలియా గెలుచుకోగా.., రెండవ మ్యాచ్ విషయంలో ట్రాక్ రికార్డు భయపెడుతోంది. రెండవ టెస్ట్ జరిగే బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో భారత్ ఐదు మ్యాచ్ లు ఆడితే ఇప్పటివరకు ఒక్కటి కూడా గెలవలేదు. దీంతో బుధవారం జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. కొత్త ఆటగాళ్లు ఉండటంతో గ్రౌండ్ ను ఎంత త్వరగా అర్థం చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకుంటారా అని ఇండియా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు నాలుగు టెస్టుల సిరీస్ లో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఆస్ర్టేలియా సిరీస్ ను గెలిచేందుకు ఇదే కీలకమైన మ్యాచ్ కావటంతో విజయం ఎవరిదనే ఆసక్తి నెలకొంది.

ఇక ఈ మ్యాచ్ లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాయంతో తొలి టెస్ట్ కు దూరమైన ధోని ఈ మ్యాచ్ తో తిరిగి జట్టులోకి వస్తున్నాడు. టీం సారధ్య బాధ్యతలు కూడా ధోని తీసుకుంటున్నాడు. ఇక ఆస్ర్టేలియా కొత్త కెప్టెన్ స్మిత్ సారధ్యంలో ఈ మ్యాచ్ ఆడనుంది. పేస్ అనుకూలంగా ఉండే పిచ్ పై భారత్ గెలిచిన దాఖలాలు లేకపోయినా.., ఈ దఫా మాత్రం రికార్డు తిరగరాస్తామని జట్టు కెప్టెన్ ధోనీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. పేస్ గ్రౌండ్ అయినా తమకు ఇబ్బంది లేదని ధీమాగా చెప్తున్నాడు.

గతంలో గబ్బాలో భారత్ కు ఫెయిల్ ట్రాక్ రికార్డు ఉన్నా భయపడటం లేదని చెప్పాడు. జొహన్నెస్ బర్గ్, డర్బన్ లేదా పెర్త్ ఎక్కడైనా, పిచ్ ఏదైనా కూడా భారత్ విజయం సాధించిందని గుర్తు చేశాడు. దీనికి తోడు కొత్త ఆటగాళ్ళు ఉండటంతో వారికి ఈ మ్యాచ్ కొత్త సవాల్ గా ఉంటుందని చెప్పాడు. యువ క్రీడాకారులు గ్రౌండ్ ను ఛాలెంజ్ గా తీసుకుని విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ధోని కూడా గతంలో ఎప్పుడూ బ్రిస్బేన్ లో ఆడకపోవటంతో ఈ మ్యాచ్ ఆయనకూ ఓ ఛాలెంజ్ లాంటిదే. మరి ఇన్ని సవాళ్ల మద్య బుధవారం నుంచి జరిగే కీలకమైన రెండవ టెస్ట్ లో ఎవరు ప్రతిభకనబరుస్తారో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia second test  dhoni on gabba stadium  cricket updates  

Other Articles