Australian cricketer phil hughes passed away cricket world mourns loss of phillip hughes

Australian Cricketer, Phil Hughes, critical condition, left hander, hit by ball, bouncer, sean abbott, New south wales, St Vincent's Hospital, ambulance, 2 days

Australian Cricketer Phil Hughes passed away, Cricket world mourns loss of Phillip Hughes

అస్ట్రేలియన్ క్రికెట్ ప్రపంచంలో రాలిన దృవతార ఫిలిప్ హ్యూస్

Posted: 11/27/2014 11:13 AM IST
Australian cricketer phil hughes passed away cricket world mourns loss of phillip hughes

అస్ట్రేలియన్ క్రికెట్లో తాజాగా మేరిసిన దృవతార ఫిలిప్ హ్యూస్ మరణించారు. అస్ట్రేలియన్ క్రికెట్ లో బ్యాటింగ్ దిగ్గజంగా పేరు తెచ్చుకుని క్రమంగా సగటు రేటును వృద్ధి చేసుకుంటూ వచ్చిన ఫిలిప్ హ్యూస్ అనంతలోకాలకు తరలివెళ్లాడు. దేశవాలీ క్రికెట్ అడుతుండగా బౌలర్ విసిరిన బౌన్సర్ అయన హెల్మట్ పై తగలడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో ఫిలిస్ అక్కడే కుప్పకూలిపోయాడు. టీమ్ మేట్స్  సమాచారంతో హుటాహుటిన వచ్చిన ఎయిర్ అంబులెన్స్ అతన్ని సెయింట్ విన్సెంట్ అస్పత్రికి తరలించింది. ఈ క్రమంలో హ్యూస్ కోమాలోకి జారుకున్నాడు. గత మూడు రోజులుగా అస్పత్రిలో చికిత్స పోందుతూ.. ఇవాళ ఆయన పరమపదించారు.

న్యూ సౌత్ వేల్స్ జట్టుతో ఎస్ సీ జీ గౌండ్ర్స్ లో దేశవాలీ క్రికెట్ అడుతుండగా.. 63 పరుగుల వద్దనున్న సమయంలో బౌలర్ సియాన్ అబోట్ విసిరిన బౌన్సర్ బంతిని పుల్ షాట్ అడబోయి విఫలం కావడంతో అతి నేరుగా తలకు తగలడం వల్ల కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడు పెట్టుకున్న హెల్మెట్ పాతది కావడం, వాయువేగంతో దూసుకోచ్చిన బంతి నేరుగా హెల్మట్ పై తగలడంతో అతని తలకు గాయమై.. క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. అయితే దేశవాలీ క్రికెట్ కావడంతో స్టేడియంలో అతని తల్లి, సోదరి చూస్తున్న మ్యాచ్ లో హ్యూస్ వీరవిహారం చేయాలనుకున్నాడు. అయితే వారు అతని అఖరి మ్యాచ్ చూస్తారని కూడా వారూహించలేదు.

అయితే గాయం తరువాత చికిత్స సొందుతున్న హ్యూస్ మరణాన్ని సెయింట్ విన్సెంట్ అస్పత్రి వైద్యులు పీటర్ బ్రుకెనర్ దృవీకరించారు. గాయంతో అస్పత్రికి వచ్చిన తరువాత హ్యూస్ ను సృహలోకి తీసుకువచ్చేందుకు తాము తీవ్రంగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. తనకు తగిలిన గాయం కారణంగా హ్యూస్ ఎలాంటి బాధను అనుభవించలేదని చెప్పారు. అయన బౌతికఖాయాన్ని చూసేందుకు కుటుంబసభ్యులకు, సన్నిహితులకు అనుమతించామని చెప్పారు. హ్యూస్ మరణం పట్ల అస్ట్రేలియా కెప్టెన్ అస్పత్రికి చేరుకున్నారు. తనకు దీర్ఘకాలికంగా వున్న సహచరడుని కోల్పయినందుకు భాధగా వుందన్నారు. హ్యూస్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

18 ఏళ్ల వయస్సులో న్యూ సౌత్ వేల్స్ తరపున నవంబర్ 2007లో కౌంటీ క్రికెట్ లో అడుగుపెట్టిన హ్యూస్.. అనతి కాలంలోనే కెప్టెన్ అయ్యే స్థాయికి ఎదిగాడు. నవంబర్ 2007లో ఐదు సీజన్లు అడిన హ్యూస్.. అ తరువాత దక్షిణ అస్ట్రేలియా జట్టలోకి చేరాడు. మైకిల్ క్లార్ తరువాత అతిపిన్న వయస్సులోనే జట్టులో చేరిన వ్యక్తిగా మారాడు. దేశవాలీ క్రికెట్ లో రికిపాయింట్ క్యాప్టన్ గా వున్నప్పుడు జోహెనస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో 2009 ఫిబ్రవరిలో టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. దేశవాలీ క్రికెట్ లో అన అద్బుత ప్రతిభతో రెండు సెంచరీలు సాధించి అరుదైన రికార్డును సాధించాడు.

గత మూడు రోజులుగా చికిత్స పోందుతూ హ్యూస్ మరణించాడని తెలిసిన వెంటనే యావత్ క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగింది. పాతికేళ్ల వయస్సులోనే హ్యూస్ పరమపదించడంపై క్రికెట్ అస్ట్రేలియా తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా కూడా హ్యూస్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles