Australian cricketer phil hughes in critical condition after being hit by ball

Australian Cricketer, Phil Hughes, critical condition, left hander, hit by ball, bouncer, sean abbott, New south wales, St Vincent's Hospital, ambulance

Australian Cricketer Phil Hughes in critical condition after being hit by ball

అస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హగ్గస్ పరిస్థితి విషమం..

Posted: 11/25/2014 11:04 AM IST
Australian cricketer phil hughes in critical condition after being hit by ball

అస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగ్గజం ఫిలిప్ హగ్గస్ పరిస్థితి విషమంగా వుంది. దేశవాలీ క్రికెట్ అడుతుండగా బౌలర్ విసిరిన బౌన్సర్ అయన తలపై గట్టిగా తగిలింది. దీంతో ఫిలిస్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిలిప్ వద్దకు వచ్చిన టీమ్ మేట్స్ అతని పరిస్థతి చూసి సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చిన అంబులెన్స్ అతన్ని సెయింట్ విన్సెంట్ అస్పత్రికి తరలించింది. అతని తలకు బలమైన గాయమైనట్టు.. పరిస్థితి విషమంగా వుందని.. అప్పేడే ఏమీ చెప్పలేమని వైద్యాధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. అస్ట్రేలియన్ బాట్స్ మెన్ ఫిలిప్ హగ్గస్.. న్యూ సౌత్ వేల్స్ జట్టుతో ఎస్ సీ జీ తో దేశవాలీ క్రికెట్ అడుతున్నాడు. 63 పరుగుల వద్దనుండగా.. బౌలర్ సియాన్ అబోట్ విసిరిన బౌన్సర్ బంతిని పుల్ షాట్ అడాలని ఫిలిప్ యత్నించాడు. కానీ బాల్ మిస్సయ్యి  అతని తలపై బలంగా తగిలింది. ఆ సమయంలో అతడు హెల్మెట్ పెట్టుకున్నా వాయువేగంతో దూసుకోచ్చిన బంతి నేరుగా హెల్మట్ పై తగలడంతో అతని తలకు గాయమైంది. దాంతో ఫిలిప్ అక్కడికక్కడే కూలబడిపోయాడు. వెంటనే అతని వద్దకు చేరుకున్న సహచర ఆటగాళ్లు.. అతడి పరిస్థతిని గమనించారు.

టీమ్ మేట్స్ ఇచ్చిన సమాచారం మేరకు అంబులెన్స్ స్టడియంలోకి చేరుకుంది, అతడిని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టిన టీమ్ మేట్స్.. అంబులెన్స్ లోకి ఎక్కించారు. హుటాహుటిన స్థానికంగా గల సెయింట్ విన్సెంట్ అస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫిలిఫ్ పరిస్థతి విషమంగా వుందని, ఇప్పుడే అయన పరిస్థతిపై ఏమీ చెప్పలేమని వైద్యవర్గాలు వెల్లడించాయి. భారత్ తో నాలుగు టెస్ట్ మ్యాచ్లు అడాల్సిన అస్ట్రేలియా తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఫిలిప్ టెస్టులో 32 సగటును నమోదు చేసుకున్నాడు. గాయంతో భాధపడుతున్న మైఖిల్ క్లార్ స్థానంలో ఫిలిప్ హగ్గస్ కు జట్టు యాజమాన్యం స్థానం కల్పించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles