Former cricketer srisanth malayali mentor role caberet movie producer pooja bhatt bollywood news

srisanth, former cricketer srisanth news, srisanth latest news, srisanth movies, bollywood caberet movie, srisanth caberet movie, pooja bhatt news, pooja bhatt hot photos

former cricketer srisanth malayali mentor role caberet movie producer pooja bhatt bollywood news

మలయాళీ డ్యాన్సర్’తో శ్రీశాంత్.. మెంటార్’గా అతుక్కుపోయాడట!

Posted: 11/24/2014 07:07 PM IST
Former cricketer srisanth malayali mentor role caberet movie producer pooja bhatt bollywood news

భారత క్రికెట్ జట్టులో కొనసాగుతున్న నేపథ్యంలో యంగ్-బౌలర్’గా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్... తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్’లో అడ్డంగా దొరికిపోయి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే! దాంతో అతడిని శాశ్వతంగా క్రికెట్ రంగం నుంచి బహిష్కరించడం జరిగింది. అయితే అందుకు తాను ఏమాత్రం బాధపడకుండా వెంటనే పెళ్లి చేసుకోవడం, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్’లో పాల్గొనడం, సినిమా అవకాశాల కోసం చక్కర్లు కొట్టడం లాంటి పనుల్లో పూర్తిగా మునిగిపోయాడు. ‘గతంలో జరిగిన ఉదంతాలను గుర్తుచేసుకుంటూ బాధపడటంకంటే.. జరగబోయే వాటిగురించి ఆలోచిస్తూ జీవితం ఆనందంగా గడిపేయడమే మంచిది’ అన్న ఫిలాసఫీతో ఈ మాజీ క్రికెటర్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం.. క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ శ్రీశాంత్.. ఇప్పుడు భవిష్యత్తును చక్కదిద్దే పనిలో పూర్తిగా మునిగిపోయాడు.

ఇదిలావుండగా.. తాజాగా శ్రీశాంత్ ఓ మలయాళీ డ్యాన్సర్’కి తాను మెంటార్’నంటూ బాగానే అతుక్కుపోయాడని సమాచారాలు వెలువడుతున్నాయి. ఇదేదో రియల్ లైప్’లో శ్రీశాంత్ ఓ అమ్మాయిని భయపెట్టిస్తున్న ఉదంతం అయితే కాదులెండి.. అతడు త్వరలోనే బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని, అందులో మెంటార్’గా వ్యవహరించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే శ్రీశాంత్ టాలీవుడ్’లో ఓ సినిమాలో నటిస్తుండగా.. బాలీవుడ్’లో మరో భారీ ఆఫర్’ను దక్కించుకున్నాడు. బూతు సినిమాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేక క్రెడిట్’ను సంపాదించుకున్న పూజాభట్ నిర్మించే తదుపరి చిత్రం ‘క్యాబరేట్’లో శ్రీశాంత్ కీలకపాత్ర పోషించనున్నాడని సమాచారం! అందులో ఓ డ్యాన్సర్’కు శ్రీశాంత్ మెంటార్’గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు కౌస్తవ్ నారాయణ్ నియోగి దర్శకత్వం వహించనున్నారు.

ఈ మూవీ గురించి పూజా మాట్లాడుతూ.. ‘‘ఈనెల మొదట్లో శ్రీశాంత్’ను అతడి బర్త్’డేకి ఒకరోజు ముందు కలిశాను. అతనితో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం సినిమా వ్యవహారాలు విషయాలు బయటికొచ్చాయి. ఆ సమయంలో నా సినిమాలోని మలయాళీ మెంటార్ పాత్రకు శ్రీశాంత్ అతికినట్టు సరిపోతాడని అనిపించింది. అందుకే అతడిని తీసుకోవడం జరిగింది’’ అని పేర్కొంది. ప్రఖ్యాత ఆడియో సంస్థ టి-సిరీస్ కూడా ఈ మూవీ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఇది సెట్స్ పైకి వెళ్లనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : former cricketer srisanth  pooja bhatt  caberet hindi movie  bollywood news  telugu news  

Other Articles