Indian cricket team leaves for australia test series

team india, australia, four test match series, virat kohli

indian cricket team leaves for australia test series

గెలుపే లక్ష్యంగా అస్ట్రేలియాకు బయల్దేరిన టీమిండియా

Posted: 11/22/2014 07:11 PM IST
Indian cricket team leaves for australia test series

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 18 సభ్యుల టీమిండియా ఆసీస్ పర్యటనకు పయనమైంది. డిసెంబర్ 4 వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో మొదటి టెస్టు బాధ్యతలను విరాట్ కోహ్లీ తీసుకోనున్నాడు. తొలిటెస్టు ధోనీ దూరం కావడంతో నమాన్ ఓజాకు స్థానం కల్పించారు. తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు.
 
సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఇటగాళ్లు లేకపోయినా.. గెలుపే లక్ష్యంగా తాము అస్ట్రేలియాకు బయలుదేరుతున్నామని భారత్ తొలి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. టీమ్  ఇండియాకు మరో వైట్‌వాష్ తప్పదని మెక్‌గ్రాత్ వ్యాఖ్యాలకు తమ ఆటతో బదులిస్తామని చెప్పాడు. ఇప్పటికే పాకిస్థాన్ తో టెస్టు మ్యాచ్ లు ఓడిన అసీస్ పై మరో విజయాన్ని భారత్ నమోదు చేసుకుంటుందని విరాట్ కోహ్లీ అన్నారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామంటున్నాడు. ఓటమి అన్న ఆలోచనే లేదని.. కుర్రాళ్లంతా ఆస్ట్రేలియా పర్యటన కోసం తహతహలాడుతున్నారని చెబుతున్నాడు. శుభారంభం చేస్తానని ఆశిస్తున్నా. మా సామర్థ్యం పట్ల, ఆటగాళ్ల స్త్థెర్యం పట్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియా పర్యటన పట్ల ఆసక్తితో ఉన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో అనుభవం సాధించడానికి, ఈ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి సానుకూలంగా ఆడాలని, దూకుడుగా ఉండాలని ప్రణాళిక రచించుకున్నాం. పరిస్థితుల్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటాం. ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉంచుకున్నామన్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఎప్పుడూ గెలుపు గురించే ఆలోచించాలని భావిస్తున్నామని. ప్రస్తుతం టీమిండియా విజయావకాశాలు మెండుగానే ఉన్నాయన్నాడు. గతంలో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించామని. ఇప్పుడు దాన్ని పునరావృతం చేయలన్న స్వప్నంతోనే అస్ట్రేలియాలో అడుగుపెడుతున్నామన్నారు. ప్రస్తుత జట్టులో అందరూ దూకుడైన మనస్తత్వం ఉన్నవాళ్లేనని.. ఆటగాళ్లకు తమపై తమకు నమ్మకముండటం ముఖ్యమన్నారు. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఉన్న రికార్డు గురించి పట్టించుకోమని.. తమ జట్టులో ప్రత్యర్థిని చూసి భయపడే ఆటగాళ్లెవరూ లేరన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టంతా టెస్టు సిరీస్ మీదే వుందన్నారు. ఆపై ముక్కోణపు సిరీస్.. ఆ తర్వాతే ప్రపంచకప్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో ఆడనుండటం వరంగా చెప్పుకోచ్చాడు. కప్పులో పిచ్‌లను చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం   లేకుండా ఈ సిరీస్ తమకు మేలు చేస్తుందన్నారు. 2012 ఆస్ట్రేలియా పర్యటన తనకు కొత్త అనుభవమని. తన కెరీర్లో అదో మైలురాయి అని చెప్పొచ్చునన్నారు. ఆ అనుభవాన్ని ప్రస్తుత ఆటగాళ్లకు పంచడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇక్కడ ఎలాంటి దృక్పథం అవసరమో చెబుతానన్నారు. ఇక్కడ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండటం కీలకమని అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించడం కూడా ఆస్ట్రేలియాలో పనికొస్తుందని ఆశిస్తున్నామని విరాట్ కోహ్లీ చెప్పారు.

టెస్టు మ్యాచ్ షెడ్యూల్

డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్)
డిసెంబర్12-16, రెండో టెస్టు(అడిలైడ్)
డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్)
జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  australia  four test match series  virat kohli  

Other Articles