Australia cricket team former wicket keeper adam gilchrist comments on mahendra singh dhoni

mahendra singh dhoni, mahendra singh dhoni wiki, adam gilchrist, adam gilchrist news, india cricket tea, 2015 world cup, australia cricket team news, mahendra singh dhoni news, mahendra singh dhoni adam gilchrist, australia cricket team

australia cricket team former wicket keeper adam gilchrist comments on mahendra singh dhoni

ధోనీ నాయకత్వం మీద ఆసీస్ మాజీ ఆటగాడు కామెంట్లు!

Posted: 11/01/2014 12:58 PM IST
Australia cricket team former wicket keeper adam gilchrist comments on mahendra singh dhoni

టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకే ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు సైతం ధోనీని ఒక గొప్ప కెప్టెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సుమారు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ తోపాటు టీ20 వరల్డ్ కప్ లను అందించడంతోపాటు టెస్టుల్లో నెంబర్ వన్ టీమ్ గా నిలబెట్టించిన ధోనీ బలమైన నాయకుడంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అలాగే తాజాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ధోనీ నాయకత్వం మీద కొన్ని వ్యాఖ్యలు సంధించాడు. ధోనీ ఒక గొప్ప నాయకుడని.. టీమిండియాను ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ గా నిలబెట్టే సత్తా అతనికే వుందని పేర్కొన్నాడు.

‘‘ధోనీ గొప్ప కెప్టెన్ అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. క్రికెట్ రంగంలో మహేంద్ర ఆరంగేట్రం చేసినప్పటినుంచి ఇప్పటివరకు ఆకట్టుకుంటూనే వున్నాడు. మొదట తన గొప్ప ప్రతిభను ప్రదర్శించిన ధోనీ.. అతి తక్కువ సమయంలోనే నాయకత్వ బాధ్యతలను స్వీకరించి సత్తా చాటుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా విజయాలను అందిస్తూ వచ్చాడు. అలాగే జట్టుకు టీ20, వన్డే ప్రపంచకప్ లు అందించడమేకాక టెస్టుల్లో భారత్ ను నెంబర్ వన్ గా నిలబెట్టాడు’’ అంటూ ధోనిని ఆకాశానికెత్తేశాడు ఈ మాజీ క్రికెటర్! 2015లో జరగబోయే ప్రపంచకప్ దృష్ట్యా ఇతనిలా ధోనీమీద ప్రశంసలు కురిపించాడు.

అలాగే తన ఆసీస్ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ అనడంలో సందేహం లేదు కానీ.. 2015లో జరగబోయే ఈ టోర్నీలో ఒక జట్టే ఫేవరేట్ అని చెప్పడం కష్టం. మరో నాలుగు జట్లకు కూడా కప్ గెలిచే అవకాశాలున్నాయి. ఆసీస్ - భారత్ సిరీస్ లో కంగారూ జట్టుకు సొంతగడ్డ బలం తప్పక వుంటుంది. బలమైన బారత బ్యాటింగ్ ఎందుకు విఫలమవుతుందో చెప్పలేను. మానసికంగా బలంగా వుండటం విదేశాల్ల కీలకం. ఈసారి ధోనీ నాయకత్వం వహిస్తున్న జట్టు ఆసీస్ గడ్డలో ఎటువంటి పెర్ ఫార్మెన్స్ చూపిస్తుందో వేచి చూడాలి’’ అంటూ గిల్ క్రిస్ట్ అన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  adam gilchrist  india cricket team  2015 cricket world cup  

Other Articles