The dashing cricketer yuvraj singh trying very hard to back in india team and feeling bad for not getting the chance from 18 months

yuvraj singh, india cricket team, yuvraj singh wiki, yuvraj singh press meet, yuvraj singh latest news, yuvraj singh cancer patient, yuvraj singh biography, indian cricket players

the dashing cricketer yuvraj singh trying very hard to back in india team and feeling bad for not getting the chance from 18 months

నా పనైపోయింది.. ఇక దేవుడే దిక్కు! :యువీ

Posted: 10/30/2014 02:50 PM IST
The dashing cricketer yuvraj singh trying very hard to back in india team and feeling bad for not getting the chance from 18 months

యువరాజ్ సింగ్.. ఒకప్పుడు టీమిండియా క్రికెట్ జట్టులో ఓ అద్భుత యువక్రీడాకారుడు. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సంచలన క్రీడాకారుడిగా పేరుగాంచాడు. గతవిషయాలెందుకు.. 2011లో జరిగిన ప్రపంచకప్ లో ఇతడొక హీరో! 365 పరుగులు సాధించడంతోపాటు 15 వికెట్ల తీసిన యువి.. భారత్ ప్రపంచకప్ గెలవడడంలో అత్యంత కీలకపాత్రను పోషించాడు. అతడు ప్రదర్శించిన ఆ ప్రతిభకు ‘‘మ్యాన్ ఆప్ ది సిరీస్’’ అతనికే దక్కింది. అటువంటి ఆటగాడికి నేడు జట్టులో అసలు చోటే లేదు. దాదాపుగా 18 నెలలనుంచి భారత్ తరఫున యువీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతేకాదు.. మీడియాలో కూడా కనుమరుగైపోయాడు. అప్పుడప్పుడు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే యువీ.. అలాకూడా కనిపించకుపోయాడు. క్యాన్సర్ లాంటి అత్యంత భయానకరమైన వ్యాధి నుంచి బయటపడి ఫిట్ నెస్ ను సాధించిన యువీ... జట్టులో మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే తాను ఇక జట్టులోకి రాలేనేమోనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఏడాదిన్నర నుంచి ఇండియా జట్టులో తనకు స్థానం దక్కకపోవడంతో తీవ్రనిరాశకు గురైన యువీ తన ఆవేదనను అందరితో పంచుకున్నాడు. ఈ సందర్భంగానే అతను మాట్లాడుతూ.. ‘‘ఇకనుంచి ఇండియా తరఫున బరిలోకి దిగే అవకాశం రాకపోవచ్చు. ఈ విషయపై నేను ఎప్పులో ఆలోచించాను. కానీ పునరాగమనం చేయగలనన్న నమ్మకమున్నంతవరకు క్రికెట్ ఆడుతూనే వుంాను. జట్టులో చోటు సాధించడంకోసం అహర్నిశలు కష్టపడతాను. గత రెండేళ్ల నుంచి నా ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో వచ్చే ఏడాదిలో జరిగే ప్రపంచకప్ కు ఎంపికవుతానో లేదో తెలియదు. ఒకవేళ ఎంపికైతే అద్భుతమే! జట్టులో చోటుకోసం ప్రయత్నించడం తప్ప నా చేతుల్లో ఏమీలేదు. అయితే సెలెక్టర్లను మెప్పించేందకు ఏ అవకాశాన్ని వదులుకోను. కానీ వన్డే ప్రపంచకప్ కు ఎంపిక కాకపోతే జీర్ణించుకోవడం చాలా కష్టమే అవుతుంది’’.

‘‘కొన్నికొన్నిసార్లు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమయ్యానుగానీ చాలాసార్లు సాధించాను. కానీ క్యాన్సర్ లాంటి అనుభవం తర్వాత లక్ష్యాలు పెట్టుకోవడం చాలా కష్టం. ఐతే మళ్లీ జట్టులోకి రావడమే నా ప్రస్తుత లక్ష్యం! ఇన్నాళ్లు జట్టులో స్థానం లభించకపోవడంతో బహుశా నేను నా చివరి మ్యాచ్ ఆడేశానేమోనని అనిపించింది’’ అంటూ యువీ తెలిపాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత యువరాజ్ అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ కి గురయ్యాడు. అయితే అటువంటిది వ్యాధిని సైతం పోరాడి తిరిగి ఇండియాలో రంగప్రవేశం చేశాడు కానీ.. తన చోటును నిలబెట్టుకోలేకపోయాడు. ఆ క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమయింది కానీ.. వాటి లక్షణాలు ఇంకా యువీని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే తన అనుభవాన్ని తిరిగి సాధించడంలో చాలానే కష్టపడుతున్నాడు యువీ. ఇతను తన ప్రతిభను చాటుకోవాలంటే రాబోయే ఐపీఎల్ మ్యాచులే చివరి అవకాశం. అందులో బాగా ప్రదర్శిస్తేగానీ యువీకి 2015 ప్రపంచకప్ లో స్థానం లభించే అవకాశాలు దాదాపు లేవని అనుమానిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  indian cricket players  cancer symptoms  2015 cricket worldcup  

Other Articles