Jammu kashmir cricket team captain ian dev singh and his team members save the flood victims

jammu kashmir cricket team, jammu kashmi latest news, srinagar floods, jammu kashmir floods, jammu kashmir floods news, jammu kashmi cricket team, jammu kashmir cricket team captain ian dev singh

jammu kashmir cricket team captain ian dev singh and his team members save the flood victims

రీల్ కాదు.. రియల్ హీరోలుగా మారిపోయిన క్రికెటర్లు!

Posted: 09/16/2014 12:51 PM IST
Jammu kashmir cricket team captain ian dev singh and his team members save the flood victims

ఇక్కడ మనం చర్చించుకోబోతున్నది అంతర్జాతీయ ఇండియన్ క్రికెటర్ల గురించి కాదులెండి... జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచుల్లో పాల్గొనే జమ్మూకాశ్మీర్ రాష్ట్రం జట్టు ఆటగాళ్ల గురించి! నిన్నమొన్నటివరకు ఈ జట్టు ఆటగాళ్లు గురించి ఎవ్వరికీ తెలియదు. వీరికి సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు వార్తల్లో వచ్చినప్పటికీ ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు! అయితే.. నేడు వాళ్లందరూ ఒక్కసారిగా హీరోలుగా మారిపోయారు. మానవత్వాన్ని చాటిచెబుతూ.. తమ ప్రాణాలను పనంగా పెట్టి ఇతరులను కాపాడీ.. రియల్ హీరోస్ అని నిరూపించుకున్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం తరఫు నుంచి ఆడే ఇయాన్ దేవ్ సింగ్ చౌహాన్, అతడి జట్టు ఆటగాళ్లు కొంతమంది ప్రాణాలు కాపాడి రియల్ హీరోస్ గా పేరు సంపాదించుకున్నారు.

సెప్టెంబర్ నెల ప్రారంభంలో చౌహాన్ జట్టు శ్రీనగర్ లో జరిగే టీ20 మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. కొన్నిరోజుల వరకు అంతా సవ్యంగానే జరిగింది కానీ... అనుకోకుండా కుండపోతగా వర్షం కురవడం ప్రారంభం అయింది. దాంతో ఆ ప్రాంతం మొత్తం వరద భీభత్సంతో అల్లకల్లోలం అయిపోయింది. వాళ్లున్న హోటల్ లో రెండో అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. దీంతో మొదటి రెండురోజులవరకు ఏంచేయాలో అర్థం కాక అక్కడే కాలక్షేపం చేశారు. అయితే మూడోరోజున కెప్టెన్ చౌహాన్, మరో ఇద్దరు కలిస 20 మీటర్ల దూరంలో వున్న షికారా బోటు వద్దకు వెళ్లారు. దాన్ని నడుపుకుంటూ తమ హోటల్ వద్దకు వచ్చి.. అందులో తమ జట్టు సభ్యుల్ని, హోటల్ లో వున్న మిగిలినవాళ్లని కాపాడారు.

ఇలా వాళ్లందరినీ బోటులో ఎక్కించుకున్న అనంతరం వాళ్లంతా కలిసి కొండగుట్ట మీదకు వెళ్లగలిగారు. అక్కడికి చేరుకున్న అనంతరం ఏంచేయాలో తెలియన ఐదురోజులపాటు అక్కడే వుండిపోయారు. తిండి, నీళ్లూ లేకుండా పస్తులుండిపోయారు. అయితే అదృష్టవశాత్తూ హోటల్ నుంచి వచ్చేటప్పుడు తమతోపాటు దుస్తులను కూడా తీసుకుని రావడంతో చలి నుంచి వారు రక్షణ పొందగలిగారు. ఇలాగే కాలక్షేపం చేస్తున్న నేపథ్యంలో అక్కడో ఓ హెలికాప్టర్ చేరుకుని.. వాళ్లందరికీ ఎక్కించుకుని తీసుకెళ్లింది. ఇలా క్రికెటర్లు తమతోపాటు హోటల్ లో కొంతమందిని కాపాడి.. రియల్ హీరోస్ గా ఖ్యాతిని పొందారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir cricket team  jammu kashmir floods  ian dev singh  srinagar floods  

Other Articles