Ishant sharma deal with conrnerstone sports and entertainment

Ishant Sharma to be managed by cornerstone sports and entertainment pvt ltd company, Indian bowler Ishant sharma, ishant sharma latest news, ishant sharma in lords grounds, ishant sharma performance in lords ground, ishant sharma deal with conrnerstone sports and entertainment, cornerstone sports and entertainment pvt ltd company, Ishant sharma news, Ishant sharma deal with CSE

Indian bowler Ishant Sharma to be managed by cornerstone sports and entertainment pvt ltd company

బాల్ తో కొడితే.. బంగారు బుట్టలో పడిన ఇషాంత్!

Posted: 07/24/2014 12:07 PM IST
Ishant sharma deal with conrnerstone sports and entertainment

లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! ఇందులో ప్రతిభావంతులైన సీనియర్ ఆటగాళ్లు జట్టులో వున్నప్పటికీ... జూనియర్లు మాత్రం దూసుకుపోయారు. మొత్తం మ్యాచ్ లో జూనియర్లే తమ సత్తాను చాటుకున్నారు. ముఖ్యంగా ఇందులో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కీలకపాత్రను పోషించాడు. గతంలో ఎన్నడూలేని విధంగా తన కెరీర్ లోనే అధ్భుత ప్రతిభను ప్రదర్శించాడు. దీంతో ఇతని దశే తిరిగిపోయింది. మ్యాచ్ అనంతరం ఇతనిని అందరూ ‘‘ఇండియన్ లార్డ్స్’’గా అభివర్ణించడం ప్రారంభించారు.

ఇన్నాళ్లవరకూ సాధారణ ఆటతో నెగ్గుకుంటూ వచ్చిన ఇషాంత్ శర్మ.. లార్ట్స్ టెస్టులో తను ప్రదర్శించిన బౌలింగ్ పెర్ఫాన్సెన్ కు ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు కూడా ఇంప్రెస్ అయిపోయారు. అలాగే దిగ్గజ క్రికెటర్ల వ్యవహారాలను చూసుకునే కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్మైంట్ (సీఎస్ఈ) అనే సంస్థ కూడా ఇంప్రెస్ అయిపోయి, అతనితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇషాంత్ కు సంబంధించిన బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, ఇతర వాణిజ్య ఒప్పందాలను మొత్తం కార్నర్ స్టోన్ సంస్థే చూసుకుంటుంది.

క్రికెటర్లకు కార్పొరేట్ ఎండార్స్ మెంట్లను తీసుకురావడం ద్వారా వారికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చడంలో ఈ సీఎస్ఈ సంస్థకు మంచి పేరుంది. ఆల్రెడీ టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ, ధావన్, రోహిత్ శర్మలతోపాటు అండర్ 19లో సంచలనాలయిన విజయ్ జోల్, స్మిత్ పటేల్ వ్యవహారాలను ఈ సంస్థే చూసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఇషాంత్ శర్మ కూడా వీరి జాబితాలోకి చేరిపోయింది. దీంతో ఇషాంత్ శర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన ఒక మంచి గుర్తింపుగా అతను పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles