Indian team fails to maintain high score

Indian team fails to maintain high score, india - england cricket match, india team fails to maintain high score, india latest news, india cricket team, england cricket player joy route

Indian team fails to maintain high score

టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన జోయ్ రూట్

Posted: 07/12/2014 03:43 PM IST
Indian team fails to maintain high score

(Image source from: Indian team fails to maintain high score)

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ట్రెంట్రిడ్జ్ టెస్టులో... ఇండియాకు తీరని నిరాశే మిగిలింది. అత్యధిక ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో భారత బౌలర్లు తమ పనితీరును వేగవంతం చేసినా.. ఫలితం లేకపోయింది. చేతికి అంది వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ధోనీ సేన చేజార్చుకుంది. తొలుత భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోయిన భారత్... చివర్లో తన పట్టును వదులుకుంది.

మ్యాచ్ మొదలైన మొదట్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు చూపించిన భారత బౌలర్లు... చివరి వికెట్ కోసం మాత్ర నానాతంటాలు పడ్డారు. భువనేశ్వర్ కుమార్, షమి, ఇషాంత్ శర్మలు ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెట్టించి, వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు. దీంతో అతిథ్య టీం వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ.. తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయింది. వరుసగా తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఇక ఇండియాదే ఆధిక్యం అన్న నేపథ్యంలో చివరి వికెట్ కి వచ్చేసరికి ప్లేటు మొత్తం మారిపోయింది.

ఇంగ్లాండ్ ఆటగాడు అయిన జోయ్ రూట్ 158 బంతుల్లో 78 పరుగులు చేసి, మూడు కీలక భాగస్వాములు నమోదు చేసి, జట్టుకు అండగా నిలిచాడు. ఇతని ముందు వరుసగా వికెట్లు పడిపోతున్నా... ఇతను మాత్రం తటస్థంగానే వుంటూ భాగస్వాములు జోడించుకుంటూ ఇంగ్లాండ్ జట్టుకు స్కోరును జోడించాడు. చివరలో అండర్ సన్ కూడా 23 పరుగులో క్రీజులోనే పాతుకుపోయాడు. వీరిద్దరు కలిసి 54 పరుగులు జోడించారు. దీంతో మూడోరోజు ఆట ముగిసేసరికి 9 వికెట్లకు 352 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో నమోదయ్యాయి. భారత్ కంటే 105 పరుగులు వెనుకబడి వున్నప్పటికీ.. భారత్ కు మాత్రం చేదు అనుభవమే ఎదురయింది. భారీ స్కోరు ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles