Bopanna-Dabrowski clinch maiden mixed-doubles title ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

Bopanna dabrowski clinch french open mixed doubles title

French Open, Rohan Bopanna, Robert Farah, Grand Slam, Gabriela Dabrowski, Anna-Lena Groenefeld

Rohan Bopanna lifted his maiden Grand Slam title by winning the French Open mixed doubles trophy with Canadian partner Gabriela Dabrowski, becoming only the fourth Indian ever to clinch a major

ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

Posted: 06/08/2017 06:48 PM IST
Bopanna dabrowski clinch french open mixed doubles title

భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్‌లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కెనడా భామ గాబ్రియెలా డబ్రోస్కితో బోపన్న జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఏడో సీడ్‌ బోపన్న జోడీ ఫైనల్లో గ్రోన్‌ఫీల్డ్‌(జర్మనీ)- ఫరా(కొలంబియా)ను మట్టికరిపించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ని గెలుచుకుంది.

ఆరంభంలో తడబడిన బోపన్న జోడీ 2-6తో తొలిసెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని 6-2తో రెండో సెట్‌ని కైవసం చేసుకున్నారు. దీంతో ఫలితం కోసం మూడోసెట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లో బోపన్న జోడీ 12-10తో గెలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ను అందుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో బోపన్న జోడీ రోజర్‌ వాజెలిన్‌(ఫ్రాన్స్‌)- హ్లవకోవా (చెక్‌రిపబ్లిక్‌)పై విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : French Open  Rohan Bopanna  Robert Farah  Grand Slam  Gabriela Dabrowski  Anna-Lena Groenefeld  

Other Articles