అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..! Denis Istomin knocks six-time champ Novak Djokovic

Denis istomin knocks six time champ novak djokovic

Rod Laver Arena, Novak Djokovic, Melbourne Park, Grand Slam, Denis Istomin, Australian Open, tennis news, sport news, tennis, sport

Defending champion Novak Djokovic was sensationally knocked out in the second round of the Australian Open by unheralded Uzbek Denis Istomin in a major shock

అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..!

Posted: 01/19/2017 09:39 PM IST
Denis istomin knocks six time champ novak djokovic

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఢిపెడింగ్ ఛాంఫియన్ అనగానే మళ్లి అతనే గెలిచే అవకాశాలు మెండుగా వుంటాయని ప్రత్యర్థి ఆటగాళ్లు కాసింత జాగ్రత్తతో అడతారు. అయితే మరోమారు గ్రాండ్ స్లామ్ సాధించాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టని టెన్నీస్ దిగ్గజ ఆటగాడు సెర్బియా స్టాక్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. ఉజెకిస్తాన్ కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు ప్రపంచ 117వ ర్యాంకర్ డెనిస్ ఇస్తోమిన్ చేతిలో ఓటమిపాలై తిరుగుముఖం పట్టాడు

టై బ్రేక్కు దారి తీసిన తొలి సెట్ను తీవ్రంగా శ్రమించి గెలిచిన జొకోవిచ్.. రెండో సెట్ను జార విడుచుకున్నాడు. అనంతరం మూడు సెట్ను సునాయాసంగా కోల్పోయిన జొకోవిచ్.. నాల్గో సెట్ గెలిచాడు. ఆపై నిర్ణయాత్మక ఐదో సెట్లో జొకోవిచ్ ను డెనిస్ మట్టికరిపించాడు. 6-7(8), 7-5, 6-2, 6-7(5), 4-6 తేడాతో జొకోవిచ్ను ఓడించి సంచలనం సృష్టించాడు డెనిస్ ఇస్టోమిన్. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఓపెన్ ను జకోవిచ్ ఆరు సార్లు గెలిచాడు. గత ఏడు సంవత్సరాల నుంచి వందో ర్యాంకు ఆటగాళ్లపై ఓడటం ఇది అతనికి రెండో సారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Novak Djokovic  australia open  denis istomin  tennis  sport  

Other Articles