డేవీస్ కప్ నుంచి నన్నెందుకు తప్పించారు..? Bopanna questions Davis Cup team selection logic

Why did you drop me rohan bopanna asks aita

Rohan Bopanna, All India Tennis Association, AITA, Leander Paes, Davis cup, Zeeshan Ali, Saketh Myneni, new zealand, pune

India's No.1 doubles pro Rohan Bopanna sent down an in the body serve to the selection committee of the All India Tennis Association, questioning the technicality on which he had been dropped.

డేవీస్ కప్ నుంచి నన్నెందుకు తప్పించారు..?

Posted: 12/27/2016 06:28 PM IST
Why did you drop me rohan bopanna asks aita

భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేసిన విధానం ఏంటి.. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జట్టును ఎంపిక చేశారు..? అంటూ భారత ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను జట్టు నుంచి తప్పించడానికి కారణాలేంటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. తనను జట్టు నుంచి తప్పించడంపై తీవ్రంగా అవేశానికి గునైన ఆయన జట్టు సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

డేవిస్ కప్ కు అఖిల భారత టెన్నిస్  సంఘం(ఏఐటీఏ) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న బోపన్న.. ర్యాంకులు ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి, మిగతా వారిపై వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశాడు. అయితే బొపన్నా అరోపణలపై స్పందించిన భారత డేవిస్ కప్ కోచ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ.. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే కచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసినట్లు తెలిపారు.

కాగా భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ , సాకేత్ మైనేని, రామ్ నాథన్ రామ్ కుమార్, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్, యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపికైంది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు, ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టులను ఏఐటీఏ ఎంపిక చేసింది. ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా, బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీలో న్యూజిలాండ్‌ తో భారత్ తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles