సెర్బియా దిగ్గజం, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ కు ఎలాంటి అంచనాలు లేని ఓ ప్లేయర్ షాకిచ్చాడు. దీంతో షాంఘై మాస్టర్స్ టోర్నీలో సెమిఫైనల్స్ రౌండ్ నుంచి ఇంటిదారి పట్టాడు. షాంఘై మాస్టర్స్ లో భాగంగా శనివారం జరిగిన సెమిఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ రొబర్టో బాటిస్టా చేతిలో 6-4, 6-4 తేడాతో రెండు వరుస సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. కేవలం తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో మూడుసార్లు మాత్రమే ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేశాడు. రొబర్టో ఆటకు జొకో నుంచి సరైన సమాధానం లేకపోయింది. దీంతో రొబెర్టోను సులువుగా విజయం వరించింది.
డిఫెండింగ్ చాంపియన్, 12 గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అయిన జొకో ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే తాను ధరించిన టీషర్టును విప్పి చైర్ అంపైర్ వైపు పడేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. క్వార్టర్స్ లో జర్మనీ ప్లేయర్ మిస్కా జ్వెరేవ్ చేతిలో ఓటమి తప్పించుకున్న డిఫెండింగ్ చాంపియన్ కు సెమిస్ లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. రాకెట్ ను పదే పదే విసిరికొడుతూ వింతగా ప్రవర్తించాడు. బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే నుంచి టాప్ ర్యాంకుకు గట్టిపోటీ ఉండటం, వరుస టోర్నీల్లో మధ్యలోనే ఇంటిదారి పట్టడం లాంటి కారణంగా జొకోవిచ్ ఇలా చేసి ఉండొచ్చునని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more
Jan 05 | బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్ వన్, 3సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more
Oct 04 | చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట... Read more
Sep 11 | యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గోని తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన మరో నల్లకలువ బామ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. తన కాలి... Read more
Jun 08 | భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో... Read more