Andy murray loses to kei nishikori in us open

us open, us open 2016, 2016 us open, andy murray, kei nishikori, murray nishikori, us open, us open 2016, nishikori murray, murray loses to nishikori, us open 2016, us open, tennis news, tennis

Andy Murray wound up losing 12 of 14 points right after the let call and seven games in a row to drop that set 6-1 and trail 2-0 in the fifth.

యూఎస్ ఓపెన్ లో ఆండీ ముర్రే పరాజయం

Posted: 09/08/2016 06:39 PM IST
Andy murray loses to kei nishikori in us open

బ్రిటన్ స్టార్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రేకు జపాన్ సంచలనం కీ నిషికోరి షాకిచ్చాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ స్వర్ణంతో జోరు మీదున్న రెండో సీడెడ్ ముర్రేకు క్వార్టర్స్ లోనే బ్రేకులు పడ్డాయి. క్వార్టర్ ఫైనల్స్ లో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో ముర్రేపై నెగ్గి నిషికోరి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. తొలి మూడు సెట్లలో రెండు సెట్లు కోల్పోయిన దశ నుంచి నిషికోరి అద్భుతంగా పుంజుకుని మాజీ చాంపియన్ ముర్రేను యూఎస్ ఓపెన్ నుంచి ఇంటిదారి పట్టించాడు. నాలుగో సెట్లో నిషికోరి ప్రతిఘటనకు ముర్రే తట్టుకోలేకపోయాడు.

ఓ దశలో మూడుసెట్లోనే మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించగా.. ఆసియా ఆటగాడు తన రాకెట్కు పదును పెట్టడంతో మ్యాచ్ ఐదు సెట్ల వరకు వెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో మాత్రం ముర్రే, నిషికోరి నువ్వానేనా అనే రీతిలో పోటీపడీ మరి పాయింట్లు సాధించారు. కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. చివరి సెట్ నెగ్గి రెండోసారి యూఎస్ ఓపెన్ సెమిస్లోకి దూసుకెళ్లాడు. 2014లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kei Nishikori  Andy Murray  US Open  men singles  Tennis  

Other Articles

  • Denis istomin knocks six time champ novak djokovic

    అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..!

    Jan 19 | ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఢిపెడింగ్ ఛాంఫియన్ అనగానే మళ్లి అతనే గెలిచే అవకాశాలు మెండుగా వుంటాయని ప్రత్యర్థి ఆటగాళ్లు కాసింత జాగ్రత్తతో అడతారు. అయితే మరోమారు గ్రాండ్ స్లామ్ సాధించాలని ఎన్నో ఆశలతో... Read more

  • Former world number one ana ivanovic retires from tennis at age 29

    టెన్నీస్ ప్రపంచం నుంచి అనా ఇవనోవిచ్ కనుమరుగు..

    Dec 29 | టెన్నిస్ ప్రపంచం నుంచి మరో అందమైన బ్యూటీ.. కనుమరుగు అయ్యింది. నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ బ్యూటీ తాను అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుని అభిమానులను షాక్ ఇచ్చింది.... Read more

  • Why did you drop me rohan bopanna asks aita

    డేవీస్ కప్ నుంచి నన్నెందుకు తప్పించారు..?

    Dec 27 | భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేసిన విధానం ఏంటి.. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జట్టును ఎంపిక చేశారు..? అంటూ భారత ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం... Read more

  • Sania mirza completes 80 consecutive weeks as world no 1

    టెన్నీస్ చరిత్రలో భారత్ తరపున సానియా అరుదైన రికార్డు..!

    Oct 19 | భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మరో అరుదైన ఘనతను సాధించింది. వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగి చరిత్రలో తనకంటూ మరో పేజీని లిఖించుకుంది. తద్వారా మహిళల డబుల్స్... Read more

  • Novak djokovic loses temper and shanghai masters semi final

    షాంఘై టోర్నీ సెమిస్ లో జొకోవిచ్ కు షాక్..

    Oct 15 | సెర్బియా దిగ్గజం, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ కు ఎలాంటి అంచనాలు లేని ఓ ప్లేయర్ షాకిచ్చాడు. దీంతో షాంఘై మాస్టర్స్ టోర్నీలో సెమిఫైనల్స్ రౌండ్ నుంచి ఇంటిదారి పట్టాడు. షాంఘై... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno