Rafael Nadal Accused of Doping by French Former Sports Minister

Rafael nadal accused of doping in shadow of sharapova

rafael nadal, nadal, rafa nadal nadal doping, nadal drug case, nadal drug, sharapova, sharapova doping, maria sharapova, tennis doping, tennis drug case, tennis news, tennis

Former French Minister of Sport told French TV that Rafael Nadal's 7-month injury hiatus in 2012 was "probably due to a positive doping test.''

నాదల్‌పై నిరాధార డోపింగ్ ఆరోపణలు

Posted: 03/12/2016 04:46 PM IST
Rafael nadal accused of doping in shadow of sharapova

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌ డోపింగ్ టెస్టులో పట్టుబడలేదు, కానీ ఆయన డ్రగ్స్ వాడి డోపింగ్ టెస్టులో దోరికిపోయాడని అరోపణలు మాత్రం ఎదుర్కెంటున్నాడు. మారియా షరపోవా పట్టుబడిన తరువాత నాదల్ అంశం టెన్నిస్ ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తుంది. అయితే నాదల్ డ్రగ్స్ వాటినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఫ్రాన్స్ దేశ మాజీ క్రీడామంత్రి రోజిలిన్ బాచెలోట్ డోపింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2012లో కొన్ని నెలలపాటు మోకాలి గాయంతో నాదల్ టెన్నిస్‌కు దూరమవడాన్ని గుర్తు చేస్తూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. 2007 నుంచి 2010 వరకు రోజిలిన్ స్పెయిన్ ఆరోగ్య, క్రీడా మంత్రిగా పనిచేశారు.

ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏడు నెలల పాటు మోకాలి నొప్పితో నాదల్ టెన్నిస్‌కు దూరమైన విషయం మనందరికీ తెలుసు. డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలినందుకే అతడు టోర్నీలను మిస్ అయ్యాడు. టెన్నిస్ ఆటగాళ్లు ఇలా సుదీర్ఘకాలం ఆటకు దూరంగా ఉన్నారంటే వారు కచ్చితంగా డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్టే. ఇలా నిరంతరం జరగకపోయినా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి’ అని రోజిలిన్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను స్పానిష్ ఒలింపిక్ కమిటీ తీవ్రంగా ఖండించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafael nadal  doping  drug case  spanish olympic committee  

Other Articles